Mission: Impossible Box Office: మిషన్ ఇంపాసిబుల్‌కు భారీ ఓపెనింగ్స్.. టామ్ క్రూజ్ మూవీకి 24 గంటల్లో రికార్డు
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఫ్రాంచైజీలో మిషన్: ఇంపాసిబుల్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్‌లో భాగంగా ఇటీవల విడుదలైన 8వ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్. ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ వన్ మూవీ 2023 సంవత్సరంలో రిలీజైంది. దానికి రెండో పార్ట్‌గా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఇండియా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. క్రూజ్ చేసిన ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రమోషనల్ ఈవెంట్స్ గొప్పగా చెప్పడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హేలీ ఎట్‌వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఇసాయి మోరేల్స్, పామ్ క్లెమెంటీఫ్, హెన్నీ జార్నీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి క్రిస్టఫర్ మాక్క్వెరీ దర్వకత్వం వహించారు.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మూవీకి హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ భారీ ఆదరణను కురిపిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే భారీ సంఖ్యలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి అని థియేటర్ యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉందనే విషయం టికెట్ల అమ్మకాలు రుజువు చేశాయి.
హైదరాబాద్‌లో మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. 24 గంటల్లో సుమారుగా 15 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి అని ప్రసాద్ మల్టీప్లెక్స్ మేనేజర్ వెంకట్ ప్రసాద్ తెలిపారు. ఇండియాలో ఈ సినిమాకు సుమారుగా 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయని మల్టీప్లెక్స్ చైన్ థియేటర్ యజమానులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











