twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ రేటు : 'తుఫాన్‌' నెల్లూరు రైట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ 'తుఫాన్‌' (జంజీర్‌) బిజినెస్ ఓ రేంజిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అడాయ్‌మెహ్రా ప్రొడక్షన్స్‌, ఫ్లైయింగ్‌ టర్టిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నెల్లూరు రైట్స్ ని క్రౌన్ మూవీస్ సంస్ధ సొంతం చేసుకుంది. ఈ రైట్స్ నిమిత్తం 1.65 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు విడుదల సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. ముఖ్యంగా 'తుఫాన్' సినిమాల విషయంలోనే ఈ సందిగ్ధావస్థ. ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించిన ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని సమాచారం. నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


    'రచ్చ', 'నాయక్‌'లతో వరుస విజయాలను అందుకొన్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌'. తెలుగులో 'తుఫాన్‌'గా వస్తోంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్. అపూర్వ లాఖియా దర్శకుడు. శ్రీహరి, తనికెళ్లభరిణి, దేవ్‌గిల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పునీత్‌ ప్రకాష్‌మెహ్రా, సుమిత్‌ ప్రకాష్‌ మెహ్రా, ఫ్త్లెయింగ్‌ టర్టిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

    ''ఆయిల్‌ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. నిజాయతీగల పోలీస్‌ అధికారి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకొంటాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణ'' అని యూనిట్ చెబుతోంది. అలాగని డేట్ వాయిదా వేస్తే, మొత్తం నేషనల్ మార్కెట్, ఓవర్‌సీస్ మార్కెట్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 6న విడుదల చేయాలని నిర్మాతలు నిశ్చయించినట్టుగా ఫిలిమ్‌నగర్ సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియాల బిజినెస్‌ని పూర్తి చేసేశారు. ఈ నెల 27న వైభవంగా హైదరాబాద్‌లో 'తుఫాన్' ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా రామ్‌చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలకాంశం కానుంది.

    English summary
    Ram Charan’s ‘Thoofan’ is gearing up for a release soon. The movie’s audio launch will take place tomorrow. As expected, the film’s pre-release business is pretty strong and deals have been closed for almost all areas. The Telugu and Hindi rights have been sold as a package for most areas. For Nellore area, Crown Movies reportedly picked up the rights for approximately 1.65 Crores, which is a shocking price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X