TOP 10 Telugu Movies: యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలివే.. ప్రభాస్‌వే 5!

ఒకప్పుడు ఏ ప్రాంతం వాళ్లు ఆ చిత్రాలనే ఎక్కువగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు జనాలు కూడా మారారు. అందుకే అన్ని ప్రాంతాలు, అన్ని భాషలకు చెందిన సినిమాలను చూస్తున్నారు. దర్శక, నిర్మాతలు కూడా అన్ని భాషల్లో తమ సినిమాలను అందుబాటులోకి తీసుకు వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు సినిమాల హవా ఖండాంతరాలు దాటింది. విదేశాల్లో కూడా తెలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో కూడా రాణిస్తున్నాయి. అయితే యూకేలో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఏవి, ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసింగ్ వసూళ్లు రాబట్టుకున్న టాప్ 10 చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

TOP 10 Highest Grossing Telugu Movies in UK List is Here Check Details

తెలుగులో వచ్చి యూకేలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ 1లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా యూకేలో 1.03 మిలియన్ పౌండ్స్ రాబట్టింది. అలాగే టాప్ 2లో లో RRR సినిమా నిలిచింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా యూకేలో 1.03 మిలియన్ పౌండ్స్ సంపాదించిన రెండో స్థానంలో నిలిచింది.

అలాగే టాప్ 3లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూకేలో 620కే పౌండ్స్ రాబట్టుకుని మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక టాప్ 4లో తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ నిలించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూకేలో 321కే పౌండ్స్ రాబట్టుకుని నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

TOP 10 Highest Grossing Telugu Movies in UK List is Here Check Details

ఇక టాప్ 5లో మళ్లీ ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూకేలో 311కే పౌండ్స్ సంపాదించి ఐదో స్థానానికి పరిమితం అయింది. ఇక ఆరో స్థానంలో సాహో నిలిచింది. ఈ సినిమాలో కూడా హీరోగా ప్రభాస్ చేయగా.. సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యూకేలో 293కే పౌండ్స్ రాబట్టుకుని టాప్ 6లో నిలిచింది.

అలాగే టాప్ 7 స్థానంలో రాధేశ్యామ్ నిలిచింది. ఈ చిత్రంలో కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యే హీరోగా చేశాడు. ఈ సినిమా యూకేలో 226కే పౌండ్స్ రాబట్టుకుని ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో అంటే టాప్ 8లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సర్కారు వారి పాట నిలిచింది. ఈ చిత్రం యూకేలో 210కే పౌండ్స్ రాబట్టుకుని.. 8వ స్థానాన్ని దక్కించుకుంది.

TOP 10 Highest Grossing Telugu Movies in UK List is Here Check Details

టాప్ 9లో మహేష్ బాబు హీరోగా మాంటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోగా చేసిన గుంటూరు కారం నిలిచింది. ఈ సినిమా యూకేలో 192కే పౌండ్స్ రాబట్టుకుని 9వ స్థానంలో నిలవడం నిజంగా గమనార్హమే. ఇక చివరి స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేసిన భీమ్లా నాయక్ సినిమా నిలించింది. ఈ చిత్రం యూకేలో 174కే పౌండ్స్ రాబట్టుకుని పదో స్థానానికి పరిమితం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X