హైదరాబాద్‌లో హయ్యెస్ట్ నెట్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాలు ఇవే.. ఏమేం ఉన్నాయంటే?

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఎక్కడైనా ఏ చిత్రమైన తెగ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా బాగుండి... హిట్ టాక్ తెచ్చుకుంటే ఏ భాష వాళ్లు అయినా సరే సినిమాను చూస్తున్నారు. తమ ప్రాంతాల్లో చిత్రాలను ఆదరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అన్ని భాషల సినిమాలు అన్ని చోట్లా అదరగొడుతున్నాయి. దేశం అంతా విపరీతమైన వసూళ్లు సాధిస్తున్నాయి. ఒక్క దేశం ఏంటి.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే సౌత్ లో విడుదల అయిన చాలా సినిమాలు హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేచ్ చేశాయి. అలా బాక్సాఫీసును షేక్ చేసిన టాప్ 10 సినిమాల జాబితా వివరాలు చూద్దాం.

హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ 1లో ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.28.12 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఇక టాప్ 2లో హనుమాన్ నిలిచింది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.18.4 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టుకుని 2వ స్థానాన్ని అందుకుంది.

TOP 10 Highest Net Grossing Movies in Hyderabad National Multiplexes List is Here Check Details

ఇక టాప్ 3లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.18.39 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుని మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 4లో కేజీఎఫ్ 2 నిలిచింది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.15.7 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని నాలుగో స్థానంలో నిలిచింది.

ఇఖ టాప్ 5లో ఆదిపురుష్ నిలిచింది. డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.11.75 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని ఐదో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 6లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.10.95 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని ఆరో స్థానంలో నిలిచింది.

టాప్ 7లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య నిలిచింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.10.74 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని ఏడో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 8లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా నిలిచింది. ఈ చిత్రం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.10.35 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని ఎనిమిదో స్థానంలో నిలిచింది.

TOP 10 Highest Net Grossing Movies in Hyderabad National Multiplexes List is Here Check Details

ఇక టాప్ 9లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నిలిచింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయగా.. హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.10.59 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 10లో రజినీ కాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్సుల్లో రూ.9.19 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని పదో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X