నార్త్‌లో హయ్యెస్ట్ నెట్ వసూళ్లు చేసిన సినిమాల లిస్టు ఇదే.. తెలుగు మూవీలు ఏమేం ఉన్నాయంటే?
ఒకప్పుడు హిందీ సినిమాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆడుతూ.. ఎక్కువగా వసూళ్లు సాధించేవి. బాలీవుడ్ కు ఉన్న క్రేజ్ మిగతా వాటికి కనిపించకపోయేది. కానీ ఇప్పుడు కథంతా మారిపోయింది. అన్ని భాషల సినిమాలు అదరగొడుతున్నాయి. దేశం అంతా విపరీతమైన వసూళ్లు సాధిస్తున్నాయి. ఒక్క దేశం ఏంటి.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే సౌత్ లో విడుదల అయిన చాలా సినిమాలు నార్త్ లో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేచ్ చేశాయి. అలా బాక్సాఫీసును షేక్ చేసిన టాప్ 10 సినిమాల జాబితా వివరాలు చూద్దాం.
సౌత్ లో వచ్చి నార్త్ లో నెట్ వసూళ్లు భారీగా రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ 1లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో రూ.511 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి మొదటి స్థానాన్ని సంపాధించుకుంది. ఇక రెండో స్థానంలో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్2 సినిమా నిలిచింది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా నార్త్ లో రూ.435 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని రెండో స్థానంలో నిలిచింది.

ఇక టాప్ 3లో RRR సినిమా నిలిచింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా హిందీలో రూ.277 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. ఇక అక్షయ్ కుమార్, రజినీ కాంత్ లు ప్రధాన పాత్రల్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 2పాయింట్ ఓ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రూ. 190 కోట్ల నెట్ వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసి టాప్ 4 స్థానాన్ని దక్కించుకుంది.

ఇక టాప్ 5లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిందీలో రూ.154 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుని ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 6లో సాహో నిలిచింది. ఈ సినిమాలో కూడా హీరోగా ప్రభాస్ చేయగా.. సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నార్త్ లో రూ.150 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుని ఆరో స్థానానికి పరిమితం అయింది. ఇక ఆ తర్వాతి స్థానంలో బాహుబలి నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిందీలో రూ.119 కోట్ల రాబట్టుకుని ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక టాప్ 8లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా నిలిచింది. హిందీలో రూ.109 కోట్ల నెట్ వసూళ్లును రాబట్టుకుని 8వ స్థానాన్ని అందుకుంది. టాప్ 9లో కాంతారా నిలిచింది. స్వయంగా తానే దర్శకత్వం వహిస్తూ.. ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి సినిమా నార్త్ లో రూ.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించి 9వ స్థఆనాన్ని దక్కించుకుంది. అయితే తాజాగా టాప్ 10లోకి తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందీలో రూ.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టుకుని 10వ స్థానాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications











