»   » టాలీవుడ్ ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ షేర్ డిటేల్స్ ... (టాప్ 10 మూవీస్ లిస్టు)

టాలీవుడ్ ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ షేర్ డిటేల్స్ ... (టాప్ 10 మూవీస్ లిస్టు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమా వసూళ్లు, లాభ నష్టాలు సినిమా ఎన్ని ఎక్కువ రోజులు ఆడుతుందనే అంశంపై ఆధారపడి ఉండేది. అయితే రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా తొలివారం సాధించే షేర్ మీదనే సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉంటున్నాయి.

ఫస్ట్ వీక్ లో సినిమా పెట్టిన పెట్టుబడికి తగిన విధంగా యావరేజ్ షేర్ రాబట్టుకోలేక పోతే.... ఆ సినిమా వల్ల నష్టాలు వచ్చాయనే అర్థం. ఈ లెక్కన చూస్తే ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా 'బాహుబలి-ది బిగినింగ్' మొదటి స్థానంలో ఉంది.

ఇప్పటి వరకు టాలీవుడ్లో ఫస్ట్ వీక్ షేర్ విషయంలో టాప్ 10లో ఉన్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.

బాహుబలి-ది బిగినింగ్

బాహుబలి-ది బిగినింగ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలిపి ఫస్ట్ వీక్ రూ. 151 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో రూ. 107 కోట్ల షేర్ వచ్చింది.

ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 150వ సినిమా ‘ఖైదీ నెం 150' చిత్రం ఫస్ట్ వీక్ రూ. 77.31 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం తొలి వారం రూ. 62.5 కోట్ల షేర్ సాధించింది.

శ్రీమంతుడు

శ్రీమంతుడు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ ఫస్ట్ వీక్ రూ. 55.25 కోట్ల షేర్ సాధించింది. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

కాటమరాయుడు

కాటమరాయుడు

పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ చిత్రం వీరమ్ చిత్రానికి రీమేక్ గా కిషోర్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాటమరాయుడు' చిత్రం తొలి వారం రూ. 55. 25 కోట్ల షేర్ సాధించింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. తొలి వారం రూ. 47.27 కోట్ల షేర్ సాధించింది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయినప్పటికీ తొలి వారం రూ. 46.94 కోట్ల షేర్ వచ్చింది. ఈ చిత్రం బయ్యర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది.

సరైనోడు

సరైనోడు

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘సరైనోడు' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారం రూ. 45.21 కోట్ల షేర్ సాధించింది. బన్నీ కెరీర్లోని భారీ హిట్ చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారం రూ. 44. 2 కోట్ల షేర్ సాధించింది.

గౌతమీపు పుత్ర శాతకర్ణి

గౌతమీపు పుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారం రూ. 41.69 కోట్ల షేర్ సాధించింది.

English summary
Check out Top 10 movies list of Tollywood All Time First Week Share. Among the Senior Heroes, Chiru managed to be in Top 5 with Khaidi and Balayya found a place in Top 10 with GPSK.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu