Box office: Top 5 ఇండియన్ సినిమాలో RRR మరో రికార్డు.. KGF ను కూడా దాటేసింది!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయబోతున్నాయని రాజమౌళి ఇదివరకే తన సినిమాలతో క్లారిటీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి ఇప్పుడు RRR సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు స్థాయిని పెంచాడు. అయితే మొత్తంగా RRR సినిమా ఇటీవల జపాన్ కలెక్షన్స్ తో కలిపి మరొక రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద టాప్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న 5 ఇండియన్ సినిమాల వివరాల్లోకి వెళితే..

మొదటి స్థానంలో దంగల్

మొదటి స్థానంలో దంగల్

మొదటి స్థానంలో అయితే దంగల్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను నితీష్ తివారి తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఏకంగా 1958 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది.

రెండవ స్థానంలో బాహుబలి 2

రెండవ స్థానంలో బాహుబలి 2

ఇక దంగల్ సినిమా తర్వాత బాహుబలి సెకండ్ పార్ట్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఒక విధంగా హాలీవుడ్ ఆడియోన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మొత్తానికి అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాలలో బాహుబలి సెకండ్ పార్ట్ 1810 కోట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

మూడవ స్థానంలో RRR

మూడవ స్థానంలో RRR

ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 మొన్నటి వరకు మూడవ స్థానంలోనే కొనసాగింది. అయితే ఇప్పుడు అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాల లిస్టులో RRR సినిమా మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. జపాన్లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంటుంది. ఇక ఆస్కార్ హడావిడితో అక్కడ మరింత కలెక్షన్స్ కూడా పెరిగాయి. ఇక మొత్తంగా కలుపుకొని ఇప్పటివరకు ఈ సినిమా 1236.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మూడవ ఇండియన్ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.

 4వ స్థానంలో KGF 2

4వ స్థానంలో KGF 2

ఇక నాలుగో స్థానంలో ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కొనసాగుతోంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయిన తర్వాత అంతకుమించి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెకండ్ చాప్టర్ దాదాపు అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

పఠాన్ 5వ స్థానంలో..

పఠాన్ 5వ స్థానంలో..

ఇక టాప్ ఫైవ్ లిస్టులో ఇప్పుడు ఐదవ స్థానంలో పఠాన్ సినిమా కొనసాగుతోంది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే మొత్తంగా ఇప్పటివరకు ఈ సినిమాకు 1048 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2, RRR సినిమాల రికార్డులను మాత్రం అందుకోకపోవచ్చు అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X