Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేశ్ మూవీని వెనక్కి నెట్టిన ‘మాస్టర్’: మన సినిమాలతో కలిసి టాప్-5లోకి ఎంట్రీ
అన్ని సీజన్లతో పోలిస్తే సంక్రాంతి పండుగ సమయంలో సినీ పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆ సమయంలో తమ సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఎప్పటి లాగే ఈ సారి కూడా కొన్ని చిత్రాలు పండుగ బరిలో నిలిచాయి. అందులో ఇటీవల విడుదలైన రవితేజ 'క్రాక్' సూపర్ డూపర్ హిట్ అవగా.. నేడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. రికార్డులు మాత్రం బద్దలైపోతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సినిమాను వెనక్కి నెట్టేశాడు విజయ్. ఆ వివరాలు మీకోసం!
రెడ్
చిత్రం
ప్రీరిలీజ్
ఈవెంట్
..రామ్
హంగామా
చూడండి
(ఫోటోలు)
సంక్రాంతి బరిలో కోలీవుడ్ స్టార్ హీరో
'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం 'మాస్టర్'. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో దీన్ని మహేశ్ కోనేరు విడుదల చేశారు.
ఎక్కడ చూసినా మాస్టర్ మేనియానే
ఇళయదళపతి విజయ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా భారీ స్థాయిలో స్పందన ఉంటోంది. ఇందులో భాగంగానే 'మాస్టర్'కు కూడా ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. మరీ ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్ తదితర దేశాల్లో ఇది ప్రదర్శితం అవుతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అన్ని ప్రాంతాల్లో షో.. అక్కడ స్పెషల్
విదేశాల్లో గత రాత్రే 'మాస్టర్' సినిమా ప్రదర్శన జరిగింది. ఇక, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మూవీ షోలు పడిపోయాయి. ఫ్యాన్స్ కోలాహళం నడుమ అన్ని థియేటర్లలోనూ సందడి వాతావరణం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో అసలైన సంక్రాంతి కనిపిస్తోంది. దీంతో చాలా చోట్ల జాతరలా మారాయి సినిమా హాళ్లు.
మిశ్రమ స్పందన.. అదే మైనస్ అంటూ
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మాస్టర్‌కు ప్రీమియర్ షోలలో మంచి స్పందన వచ్చింది. అయితే, నేటి ఉదయం ఈ సినిమా టాక్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ బాగుందని చెబుతున్న ప్రేక్షకులు.. సెంకాడాఫ్ మాత్రం సాగదీతగా ఉందని అంటున్నారు. దీంతో కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపించాయని చెబుతున్నారు. ఫలితంగా సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
మహేశ్ మూవీని వెనక్కి నెట్టిన ‘మాస్టర్'
టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల పరంగా ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' మూవీ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంలో ఈ సినిమా సత్తా చాటింది. మొదటి రోజు 2.57 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ దెబ్బకు మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' వెనక్కి వెళ్లిపోయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
మన సినిమాలతో కలిసి టాప్-5లోకి
ఆస్ట్రేలియాలో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో 'బాహుబలి' 8.25 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 3.65 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో 'సాహో'.. 2.57 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో 'అల.. వైకుంఠపురములో' మూడో స్థానంలో నిలిచాయి. 'మాస్టర్' నాలుగు.. 'సరిలేరు నీకెవ్వరు' (2.37 లక్షలు) ఐదో స్థానంలో ఉన్నాయి.