మీడియం రేంజ్ సినిమాలతో బాక్సాఫీస్ జాక్ పాట్.. అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల లిస్టులో విరూపాక్ష

భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన కూడా నిర్మాతలకి వచ్చే లాభాలు చాలా తక్కువ ఉంటాయి. దానికి కారణం ఆయా సినిమాల మీద బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉండటమే. ఇక మీడియమ్ రేంజ్ మూవీస్ అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వస్తాయి. అలాగే హీరో మార్కెట్ వేల్యూ చూసుకొని నిర్మాతలు ఖర్చు పెడతారు.

అదే సమయంలో ఆయా సినిమాల మీద బిజినెస్ కూడా మినిమమ్ రేంజ్ లోనే జరుగుతుంది. అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం నిర్మాతలని డిస్టిబ్యూటర్స్ ని భారీ లాభాలు తీసుకొస్తాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యువ దర్శకులు మంచి కంటెంట్ బేస్డ్ కథలతో మినిమమ్ బడ్జెట్ సినిమాలని చేస్తూ అంచనాలకి మించి సక్సెస్ అందుకుంటున్నారు. ఆ వివరాలలోకి వెళితే..

Top profitable Medium budget movies in tollywood and virupaaksha collections

మొదటి స్థానంలో: ప్రేక్షకులకి తమ కాన్సెప్ట్ లతో కొత్త అనుభూతి అందిస్తూ బ్లాక్ బస్టర్స్ ని ఖాతాలో వేసుకుంటున్నారు. అలా మినిమమ్ బడ్జెట్ తో వచ్చి భారీగా లాభాలు తీసుకొచ్చిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ గీతా గోవిందం మూవీ నిలుస్తుంది. ఈ సినిమాపై 15 కోట్ల బిజినెస్ జరగగా ఏకంగా 55.43 కోట్ల లాభాలు వచ్చాయి.

Top profitable Medium budget movies in tollywood and virupaaksha collections

కార్తికేయ2 - ఉప్పెన: తరువాత నిఖిల్ కార్తికేయ2 మూవీ పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కావడంతో 12.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యి ఏకంగా 45.60 కోట్ల లాభం తీసుకొచ్చింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఉప్పెన మూవీపై 20.05 కోట్ల థీయాట్రికల్ వ్యాపారం జరిగింది. 31.02 కోట్ల లాభం అర్జించింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన శేఖర్ కమ్ముల చిత్రం ఫిదా 18 కోట్ల బిజినెస్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 30.05 కోట్ల లాభాలు అందించింది.

Top profitable Medium budget movies in tollywood and virupaaksha collections

సీతారామం - జాతిరత్నాలు: దుల్కర్ సల్మాన్ మహానటి తర్వాత చేసిన రెండో తెలుగు మూవీ సీతారామంపై 16.02 కోట్ల వ్యాపారం జరిగింది. రిలీజ్ తర్వాత అంచనాలకి మించి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని 30.30 కోట్ల లాభాలు అందించింది. ఇక అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన కామెడీ మూవీ జాతిరత్నాలు 11 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో 27.52 కోట్ల లాభాలని తీసుకొచ్చింది.

Top profitable Medium budget movies in tollywood and virupaaksha collections

ఇస్మార్ట్ శంకర్ - విరూపాక్ష: పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి హైప్ క్రియేట్ చేసుకొని 17.7 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ చేసింది. రిలీజ్ తర్వాత ఏకంగా 22.78 కోట్ల లాభాలు అందించింది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీపై 22.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ బ్రేక్ ఎవెన్ ని మూడు రోజుల్లోనే ఈ చిత్రం అందుకొని ఇప్పటి వరకు 22.77 కోట్ల లాభాలని అర్జించింది. ఇవన్ని మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ అదిరిపోయే కంటెంట్ లతో ప్రేక్షకులని అలరించిన చిత్రాలే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X