twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Top Telugu Movies 2022 First Half: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాలు.. టాప్ 3లో KGF 2

    |

    ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులతో పాటు అతి దారుణమైన డిజార్డర్స్ కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా అగ్రహీరోలు విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యారు. మరికొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించాయి. ఇక ఈ ఏడాది సగం కాలం ముగిసే సరికి ఏ సినిమాలు రిజల్ట్ తో సంభంధం లేకుండా అత్యధిక కలెక్షన్స్ సాధించి టాప్ లో నిలిచాయి. కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

    RRR నెంబర్ 1 రికార్డు

    RRR నెంబర్ 1 రికార్డు

    బాక్సాఫీస్ వద్ద ఈసారి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో RRR తెలుగులో అయితే టాప్ లిస్ట్ లో నిలిచింది. ఈ సినిమా తెలుగులో 614 కోట్ల కలెక్షన్స్ అందుకుని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక లాభాలు అందించిన సినిమాగా కూడా నిలిచింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

    సర్కారు వారి పాట

    సర్కారు వారి పాట

    ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. మరోసారి మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 110 కోట్ల కలెక్షన్స్ అందుకని నిర్మాతలకు మంచి నష్టాలను అయితే కలిగించలేదు. కానీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోవాల్సి వచ్చింది.

    తెలుగులో KGF 2 రికార్డ్

    తెలుగులో KGF 2 రికార్డ్

    కన్నడ సినిమా KGF చాప్టర్ 2 తెలుగు లో భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా తెలుగు భాషలో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అనుకున్నట్లుగానే 103 కోట్లు రాబట్టింది. నిర్మాతకు మాత్రమే కాకుండా బయ్యర్లకు భారీస్థాయిలో లాభాలను అందించింది.

    రాధే శ్యామ్ డిజాస్టర్

    రాధే శ్యామ్ డిజాస్టర్

    ఇక ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లో విడుదలైన ఫ్యాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ ఎక్కడా కూడా పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకు లాభాలను మాత్రం అందించలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నష్టాలను కలుగజేసింది. ఈ సినిమా తెలుగులో మొత్తంగా 83.70 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకుంది.

    భీమ్లా నాయక్, F3 కలెక్షన్స్

    భీమ్లా నాయక్, F3 కలెక్షన్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలోనే ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక ఈ సినిమా కూడా నిర్మాతలకు మాంచి లాభాలను అందించింది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలను మిగిల్చింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 97.8 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక మరొక మల్టీస్టారర్ కామెడీ మూవీ F3 బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్స్ లాభాలను అందించలేకపోయింది. మొత్తంగా ఈ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద 56.91 కోట్లు వసూళ్లను సొంతం చేసుకుంది.

    ఆచార్య

    ఆచార్య

    ఇక ఎన్నో అంచనాల నడుమ తెరపైకి వచ్చిన ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ దారుణమైన నష్టాలను కలుగజేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఆచార్య సినిమా మొత్తం 48.36 కోట్లను రాబట్టింది.

    బంగార్రాజు, మేజర్

    బంగార్రాజు, మేజర్

    అక్కినేని మల్టీస్టారర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొత్తానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఫినిష్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. మొత్తంగా బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద 39.15 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన మేజర్ కూడా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించింది. మేజర్ సినిమా 33.35 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

    English summary
    Top Telugu Movies In First Half Of 2022: RRR, Sarkaru Vaari Paata, KGF Chapter 2 Tops The List
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X