For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajamouli to Sekhar Kammula: ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న తెలుగు దర్శకులు

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతోంది. ఒక సినిమా విడుదల అవుతోంది అంటే దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని థియేటర్స్ కు వస్తున్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది. వారు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. అయితే కొందరు రెమ్యునరేషన్ కాకుండా సినిమా బిజినెస్ లో వాటాలు కుడా తీసుకుంటున్నారు. మొత్తంగా టాప్ దర్శకుల నెంబర్లపై ఒక లుక్కేస్తే..

  ఎస్ఏస్.రాజమౌళి

  ఎస్ఏస్.రాజమౌళి

  బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ స్థాయిని పెంచాడు కాబట్టి మొదటగా ఈ దర్శకుడే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. రాజమౌళి ఎక్కువగా బిగ్ బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు కాబట్టి రెమ్యునరేషన్ లా కాకుండా బిజినెస్ లో వాటాలు తీసుకుంటూ వస్తున్నారు. మార్కెట్ పరంగా చూసుకుంటే బిజినెస్ బట్టి ఒక 200కోట్ల సినిమాకు 30కోట్లకు పైగా తీసుకుంటారట. ఇక RRRకు షేర్స్ ద్వారానే డీలింగ్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. అంటే సినిమా బిజినెస్ బట్టి ఆ సినిమాకు 100కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్

  త్రివిక్రమ్ శ్రీనివాస్

  మరొక అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా గత కొంతకాలంగా రాజమౌళి తరహాలోనే వెళుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ లో తప్పితే మరొక సంస్థలో సినిమాలు చేయట్లేదు. అల.. వైకుంఠపురములో హిట్టయ్యింది కాబట్టి 20కోట్ల వరకు అడిగే డిమాండ్ ఉంది. ఇక మహేష్ బాబు సినిమాకు అంతకంటే ఎక్కువ వచ్చేలా లాభాల్లో వాటా అడిగే అవకాశం ఉందట.

  సుకుమార్

  సుకుమార్

  మైత్రి మూవీ మేకర్స్ తో రంగస్థలం సినిమా చేసినా సుకుమార్ బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో మళ్ళీ అదే ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు. బన్నీతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప రెండు బాగల కోసం 30కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం.

  కొరటాల శివ

  కొరటాల శివ

  ఇక మినిమమ్ పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా చేయడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు. రిస్క్ లేకుండా సినిమాను సేఫ్ జోన్ లో ఉంచుతాడు. ఇక ఆ ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాకు 13కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

  అనిల్ రావిపూడి

  అనిల్ రావిపూడి

  వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం 9కోట్లు తీసుకున్న అనిల్ ప్రస్తుతం చేస్తున్న F3 కోసం 10కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

  శేఖర్ కమ్ముల

  శేఖర్ కమ్ముల

  శేఖర్ కమ్ముల కూడా ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ఒకరని చెప్పవచ్చు. ఫిదా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక లవ్ స్టొరీ సినిమాకు 10కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధనుష్ తో చేయబోయే బిగ్ బడ్జెట్ సినిమాకు కూడా అంతకంటే ఎక్కువ రావచ్చని సమాచారం.

  బోయపాటి శ్రీను

  బోయపాటి శ్రీను

  బోయపాటి శ్రీను కూడా వినయ విధేయ రామ వరకు ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకు 8కోట్ల వరకు ఇచ్చారాట. ఇక ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం వలన అఖండ సినిమాకు కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. ఓకవేళ సినిమా హిట్టయితే పారితోషికం డబుల్ కూడా అవుతుందట. అలా డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

  Mahesh Babu కోసం Malayalam హీరోయిన్ | Ssmb 28 Upadate | Filmibeat Telugu
  మిగతా వాళ్ళు..

  మిగతా వాళ్ళు..

  పూరి జగన్నాథ్ అయితే ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేసుకుంటున్నారు. ఇక సురేంధర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు సినిమా రేంజ్ ను బట్టి 5 నుంచి 6కోట్ల మధ్యలో అందుకుంటున్నారు. కొన్నిసార్లు సినిమాకు హిట్టయితే వారికి కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తోందట. ఫైనల్ సక్సెస్ అయితే దర్శకులకు ఈ రోజుల్లో హీరోలతో సమానంగా పేమెంట్స్ అందుతాయని చెప్పవచ్చు.

  English summary
  A market is being created in the Tollywood industry for heroes as well as directors. A movie being released means that the director is coming to the theaters keeping in mind who he is. Now all eyes are on the big directors. Everyone is interested in how much remuneration they will get. However, some are also taking shares in the film business in addition to remuneration. If you take a look at the overall top director numbers ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X