Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టోటల్ ఢమాల్ రికార్డు కలెక్షన్లు.. గుట్టుచప్పుడు కాకుండా రూ.200 కోట్లు!
కామెడీ ప్రధానంగా తెరకెక్కిన టోటల్ ఢమాల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్నది. గుట్టు చప్పుడు కాకుండా కోట్ల మేర కాసుల వర్షం కురిపిస్తున్నది. అనిల్ కపూర్, అజయ్ దేవగన్, మాధురి దీక్షిత్ నటించిన ఈ చిత్రం ఈ ఏడాది అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెట్టడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే..
గట్టిపోటీని తట్టుకొని భారీగా
పరీక్షలు, వేసవి సెలవులు, అన్ సీజన్ అనే తేడా లేకుండా బాలీవుడ్లో కంటెంట్ ఉన్న చిత్రాలు హంగామా చేస్తున్నాయి. దేశభక్తి ప్రధానంగా రూపొందిన యాక్షన్ చిత్రం యూరీ దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన బద్దా చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. అంతేకాకుండా సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన లుకా చుప్పీ అనే చిత్రం విమర్శల ప్రశంసలందుకొన్నది.
నాలుగోవారంలో కూడా ధమాకా
బద్లా, లుకా చుప్పీ లాంటి మంచి చిత్రాల మధ్య హాస్య ప్రధానంగా రూపొందిన టోటల్ ఢమాల్ కూడా దిమ్మతిరిగే కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాలుగో వారాంతంలో శుక్రవారం రూ.95 లక్షలు, శనివారం రూ.1.60 కోట్లు, ఆదివారం రూ.2.50 కోట్లు వసూళు చేసింది. దీంతో ఈ చిత్రం దేశీయంగానే రూ.150 కోట్ల మార్కును దాటింది.
200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు
టోటల్ ఢమాల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.150.76 కోట్లు నమోదు చేసింది. రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే దాదాపు రూ.200 కోట్లకు చేరువైందనే మాట వినిపిస్తున్నది. సినీ విమర్శల ప్రశంసలు పొందలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధురి, అనిల్ కపూర్ జంటకు మంచి రెస్పాన్స్ వ్యక్తమైంది.
సినీ క్రిటిక్స్ షాక్
టోటల్ ఢమాల్ చిత్రం రిలీజ్ తర్వాత క్రిటిక్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మాధురి, అనిల్ కపూర్ జంట కెమిస్ట్రీపై విమర్శకులు పెదవి విరిచారు. కానీ దర్శకుడు ఇంద్రకుమార్ తనదైన శైలిలో రూపొందించిన స్క్రిప్టుతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. దాంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించిందనే మాట సినీవర్గాల్లో వినిపిస్తున్నది.