వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘టోటల్ ధమాల్’.. రూ. 100 కోట్ల దిశగా!
అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'టోటల్ ధమాల్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడమే కాక..వీక్ డేస్‌లోనూ అదరగొడుతోంది.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అనిల్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. విడుదలైన 5 రోజుల్లోనే వసూళ్లు రూ. 80 కోట్ల మార్కును రీచ్ అయ్యాయి. సెకండ్ వీకెండ్ పూర్తయ్యేలోపే రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

'టోటల్ ధమాల్' మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటం నన్ను థ్రిల్ చేస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసించడం వస్తున్నాయి. ఆ మాటలు వింటుంటే చాలా సంతృప్తిగా ఉందని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు.
దాదాపు 19 సంవత్సరాల గ్యాప్ తర్వాత అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ కలిసి నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ఇంకా రితేష్ దేశ్‌ముఖ్, జానీ లీవర్, అర్షద్ వర్షి, జావెద్ జఫెరీ, బోమన్ ఇరానీ, సంజయ్ మిశ్రా, ఇషా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











