Tourist Family Collections: సిమ్రాన్ మూవీ బాక్సాఫీస్ జోరు.. టూరిస్ట్ ఫ్యామిలీకి ఎన్ని కోట్లంటే?

దక్షిణాది సినిమా పరిశ్రమలో సీనియర్ హీరో, హీరోయిన్లు సిమ్రాన్, శశికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. అభిషాన్ జీవింత్ అనే నూతన దర్శకుడు రూపొందించిన చిత్రంలో యోగిబాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని నజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మే 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్ట్ చేస్తున్న వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కామెడీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కథ విషయానికి వస్తే.. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత శ్రీలంక తలెత్తిన ఆర్థిక సంక్షోభం. దాని వల్ల తమిళ మధ్య తరగతి కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలను బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను హాస్యం, సమాజాన్ని ఆలోచించే అంశాలతో రూపొందించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతున్నది.

Tourist Family Collections

టూరిస్ట్ ఫ్యామిలీ షూటింగ్‌ను తక్కువ బడ్జెట్, అతి తక్కువ పని రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాను కేవలం 35 రోజుల్లో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, మూవీ ప్రమోషన్స్ ఖర్చులు అన్నీ కలిపి ఈ మూవీని సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 8 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్‌గా బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.

తమిళనాడులో సూర్య నటించిన రెట్రో లాంటి భారీ బడ్జెట్ సినిమా నుంచి ఎదురైన పోటీ నుంచి తట్టుకొని బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా గత రెండు రోజుల్లో రెస్పక్టబుల్ ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది. ఈ చిత్రానికి ముఖ్యంగా ఈవెనింగ్, లేట్ నైట్ షోలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా దాదాపు 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది.

సిమ్రాన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు తమిళం, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల నెట్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు 1.5 కోట్ల రూపాయల నెట్, 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా గత రెండు రోజుల్లో 3.5 కోట్ల నెట్, 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక 3వ రోజు కూడా ఈ సినిమా గ్రాండ్‌గా ఆక్యుపెన్సీతో బాక్సాఫీస్ జోష్‌ను ప్రారంభించింది. ఈ మూవీ ఉదయం ఆటలకు 45 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటలకు 50 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ చేసిందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఈ సినిమా శనివారం రోజున సుమారుగా 2 కోట్ల రూపాయల మేర వసూళ్లను నమోదు చేయవచ్చు. సూర్య సినిమా రెట్రోకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Read more about: Tourist Family simran yogi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X