Toxic AP TG Business: ఆంధ్రా, నైజాంలలో టాక్సిక్‌కు రికార్డ్ బిజినెస్.. యష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

కేజీఎఫ్ ఫేమ్, కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తోన్న తాజా చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో యష్ సరసన రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరి గురించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

మార్చి 19న టాక్సిక్ రిలీజ్
అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ ఏడాది మార్చి 19న టాక్సిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల యష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు వివాదాలను తీసుకొచ్చింది.

Toxic AP TG Theatrical Business in Yash s Movie budget Theatrical Business and Breakeven target details here

టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్స్‌పై వివాదం
ఫుల్ యాక్షన్ మోడ్‌లో, వయలెన్స్, ఇంటిమేట్ సీన్స్‌, యాక్షన్ సహా అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను దట్టించి కట్ చేసిన ఈ గ్లింప్స్‌కు యష్ అభిమానులు ఫిదా అయ్యారు. ఈ గ్లింప్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందో? యష్ పాత్ర ఏంటో? హింట్ ఇచ్చారు గీతూ మోహన్‌దాస్. అయితే ఈ గ్లింప్స్‌లో మితిమీరిన యాక్షన్.. కారులో రొమాన్స్ సీన్ వివాదాస్పమైంది. ఈ గ్లింప్స్‌లోని ఓ చోట రౌడీలకు, హీరోకి మధ్య భారీ యాక్షన్ సీన్ జరుగుతుండగా.. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్ల మధ్యలో స్మశానం వద్ద యష్ ఓ ఫారిన్ అమ్మాయితో కారులో రొమాన్స్ చేస్తున్న ఇంటిమేట్ సీన్స్ చర్చనీయాంశం అయ్యాయి.

టాక్సిక్‌ వివాదంపై సీబీఎఫ్‌సీ క్లారిటీ
దీనిపై నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పాటు విషయం కర్ణాటక మహిళా కమీషన్ వరకు వెళ్లింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమీషన్.. ఈ వివాదంపై తేల్చాల్సిందిగా సెన్సార్ బోర్డ్‌ను ఆదేశించింది. దీనిని పరిశీలించిన సీబీఎఫ్‌సీ.. ఈ గ్లింప్స్ థియేటర్‌లో విడుదల కాలేదని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారని దీనికి సెన్సార్ బోర్డ్ అనుమతి అవసరం లేదని పేర్కొంది. దాంతో వివాదం సద్దుమణిగింది. అయితే రిలీజ్ నాటికి ఎలాంటి వివాదం లేకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాక్సిక్‌పై భారీ అంచనాలు
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఈ అంచనాలను పెంచేసింది. దాంతో టాక్సిక్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేజీఎఫ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ యష్‌కు ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన నటించిన సినిమాల కోసం తెలుగు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్‌ థియేట్రికల్ రైట్స్‌కు రికార్డ్ ధర పలికినట్లుగా ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఏపీ, తెలంగాణలో టాక్సిక్‌కు రికార్డ్ బిజినెస్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాలు కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ థియేట్రికల్ రైట్స్‌‌కు 40 కోట్ల రూపాయలతో డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. మల్టీప్లెక్స్ చైన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు ఈ డీల్‌ను కమీషన్ బేసిస్ మీద సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో టాక్సిక్ మూవీ ఏపీ, తెలంగాణలలో బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 82 కోట్ల రూపాయల గ్రాస్.. 41 రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. దీంతో యష్ ముందు భారీ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. అదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 రిలీజ్ కానుండటంతో యష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Read more about: toxic yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X