Toxic North America Business:నార్త్ అమెరికాలో యష్ ముందు భారీ టార్గెట్..ఆ రికార్డ్‌ని టాక్సిక్ బ్రేక్ చేస్తుందా
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై హైప్ మరింత పెంచాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాల నేపథ్యంలో భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డ్ బిజినెస్ సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో టాక్సిక్ బిజినెస్ ఎన్ని కోట్లు? యష్‌ను ఊరిస్తోన్న రికార్డ్ ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..
ఇందులో రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

టాక్సిక్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి టాక్సిక్ మూవీకి 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ కావడంతో పాటు ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌తో టాక్సిక్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. శాండల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సరిగ్గా అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 రావడం ఈ అంచనాలను మరింత పెంచేసింది.
టాక్సిక్ థియేట్రికల్ బిజినెస్
ఈ సినిమాపై అంచనాల నేపథ్యంలో థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ 100 కోట్ల రూపాయలు, తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 63 కోట్ల రూపాయలు, కేరళ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 100 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 105 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 500 కోట్ల రూపాయల మేర టాక్సిక్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 600 కోట్ల రూపాయల షేర్.. 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
యష్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
ఓవరాల్‌గా టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిలింస్ దక్కించుకోగా.. నార్త్ అమెరికా థియేట్రికల్ హక్కులను ప్రైమ్ మీడియా సొంతం చేసుకుంది. యష్ గత చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్ 2 నార్త్ అమెరికాలో భారీ వసూళ్లను సాధించిన నేపథ్యంలో టాక్సిక్ రైట్స్ కోసం భారీ డీల్‌తో ప్రైమ్ మీడియా ధైర్యం చేసింది. అది కూడా రిఫండబుల్ కింద టాక్సిక్ హక్కులను సంపాదించింది. నార్త్ అమెరికాలో టాక్సిక్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 6.5 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 60 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఆ రికార్డ్‌పై యష్ కన్ను
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కేజీఎఫ్ 2 నార్త్ అమెరికాలో థియేట్రికల్ రన్ ముగిసేసరికి 7.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 57.21 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తద్వారా నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. దీంతో టాక్సిక్ ఈ వసూళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. మరి యష్ ఎంత మేరకు సత్తా చాటుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











