Toxic Worldwide Business: టాక్సిక్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. యష్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్‌, ఎలివేషన్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కునాల్ శర్మ సౌండ్ ఇంజినీర్‌గా, గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష కొరియోగ్రాఫర్లుగా, జేజే పెర్రీ, అంబరివ్, కెచా కంపాక్‌డీ, అమృత్ సింగ్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2026, మార్చి 19వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గ్లింప్స్, టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Toxic Theatrical Release Business Worldwide

టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. యష్ కెరీర్‌లోనే అత్యంత క్రేజీగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రొడక్షన్స్ కాస్ట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో థియేట్రికల్ బిజినెస్ జోరుగా సాగింది. తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన ఎస్‌వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకొన్నది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 120 కోట్ల రూపాయల మేర జరిగింది అని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను 120 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి కమీషన్ బేస్‌పై సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఏపీ, నైజాం తర్వాత టాక్సిక్ బిజినెస్ వ్యవహారం కర్నాటకలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను నిర్మాత కేవీఎన్ తన సొంత బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ ద్వారా స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సుమారుగా 100 కోట్లుగా వాల్యూ చేసినట్టు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు.

ఇక తమిళనాడు బిజినెస్ మరో అత్యంత చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో ఏరియాల వారీగా ఒక్కో డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకొన్నారు. చెన్నై సిటీ, చెంగళ్‌పట్టు, కోయంబత్తూరు, ఆర్కాట్, మధురై, త్రిచీ, సలెం ప్రాంతాల్లో ఒక్కో డిస్ట్రిబ్యూటర్ రైట్స్‌ను దక్కించుకొన్నారు. తమిళనాడు రైట్స్ 63 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ అయింది.

ఇక కేరళలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 350 నుంచి 400 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా హక్కులను ఏఏ సంస్థ దక్కించుకొన్నది. ఈ చిత్రం హక్కులు సుమారుగా 30 కోట్ల రూపాయలు మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే నార్త్ ఇండియాలో హిందీ రైట్స్‌కు 100 కోట్లకుపైగానే బిజినెస్ జరిగింది అని తెలిసింది.

ఇదిలా ఉండగా, ఓవర్సీస్ రైట్స్‌కు భారీగా రేటు పలికింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను 105 కోట్ల రూపాయల మేర జరిగింది. అయితే ఈ సినిమాను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, యూఏఈ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ సుమారుగా 500 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 600 కోట్ల రూపాయల షేర్, 1200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: toxic yash box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X