శ్రీ కంటేమహానంది బెటర్
ఈ వారంవిడుదలైన రెండు ఫ్యాక్షన్ సినిమాల్లో మహానందిబెటర్. ఇదేఇతివృత్తంతో వచ్చిన మరో సినిమాశ్రీ కలెక్షన్లు క్రమంగాక్షీణిస్తున్నాయి. మహానంది కథపాతదే అయినా శ్రీహరి మెరటుదనం,అనుష్క సుకుమారత్వం సినిమాను నిలబెట్టాయి. ఈసినిమా బి,సి సెంటర్లలో మంచికలెక్షన్లను రాబడుతోంది. యువ దర్శకుడుదశరథ్ తన శైలి నుంచి వైదొలగి చేసినఫ్యాక్షన్ కథాచిత్రం శ్రీ బాక్సాఫీసు వద్ద దెబ్బతింది.మోహన్‌బాబు చిన్న కొడుకుమనోజ్‌కుమార్‌ను యాక్షన్ హీరోగాఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సినిమాలోప్రయత్నం జరిగింది. సాఫ్ట్ సినిమాలను చక్కగాతీస్తాడన్న పేరున్న దశరథ్ తనమార్కెట్‌ను విస్తరించుకునేందుకు రొటీన్‌ఫ్యాక్షన్ కథను ఎంచుకున్నాడు. యాక్షన్‌సినిమాను కూడా తనదైనస్లో స్టైల్‌లో తీయడంతో ఈ సినిమారెంటికి చెడ్డ రేవడి అయింది. మంచుమనోజ్‌కుమార్‌కు రెండో సినిమా కూడానిరుత్సాహాన్ని మిగిల్చింది. తమిళ డబ్బింగ్ సినిమాలు డబ్బంతాతీసుకుపోతున్నతరుణంలో అటువంటి మరో సినిమాఎస్‌పి నాయక్ గ్రామీణ ప్రేక్షకులనుఆక ట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











