లీలామహల్‌తప్ప అన్నీ ఫ్లాపులే
గురువారంవరకు విడుదలైన సినిమాల్లోలీలామహల్ సెంటర్ తప్ప అన్నీ చతికిలపడ్డాయి. తరుణ్- జయంత్‌లకాంబినేషన్‌లో వచ్చిన సఖియా నాతోరా సినిమా ఘోరంగా విఫలమైంది.తనకు బద్దకం కొంచెం ఎక్కువనిఇంటర్వ్యూలలో చెప్పే జయంత్ ఆ విషయంనిజమేనని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. విష్ణువర్ధన్‌సూర్యుడికి మొదటి వారమే గ్రహణం పట్టేసింది.వంశీదొంగరాముడు అండ్ పార్టీసినిమానుఎలా పల్టీ కొట్టించాడో కొంచెం టచ్‌లో ఉంటే చెబుతానుకూడా అలాగే అయింది. ఈ సినిమాప్రేక్షకుల హృదయాలను టచ్ చేయలేకపోయింది. తారకరత్ననుగట్టెక్కిస్తుందనుకున్న నో సినిమాకు ప్రేక్షకులు నో అంటున్నారు. ఈసినిమా దారుణమైన ఫ్లాప్.గురువారం విడుదలైన నాలుగుచిత్రాల్లో మూడు విద్యార్ధి ఆ నలుగురు అంజలీ ఐ లవ్‌యులుకూడాచెప్పుకోదగ్గ రీతిలో లేవు. విద్యార్ధి పాస్‌మార్కులకు చాలా దూరంలో ఉన్నాడు. సినిమాలో సహజత్వం లేకపోవడంపెద్ద లోపం. సెమీ ఎక్స్‌పర్‌మెంటల్‌చిత్రం ఆ నలుగురు మంచి సినిమాలా కన్పించినా కలెక్షన్లు తేవడంకష్టం. మంచు పల్లకి చిత్రంక్లెయిమాక్స్ మార్చి తీసిన సినిమా అంజలీఐలవ్ యూ కథనం బోర్ కొట్టించింది. ఈ సినిమాకూడా ఆడడం కష్టమే.


Click it and Unblock the Notifications











