చంద్రముఖితోటాటా ఇండికాం బిజినెస్
ఈమధ్యకొన్ని సినిమాలు ప్రఖ్యాత వ్యాపార సంస్ధలతోటైఅప్ చేసుకుని ముందే కొంత డబ్బురాబట్టుకుంటున్నాయి. శేఖర్ కమ్ములఆనంద్ (మంచి కాఫీ లాంటి సినిమా)ఒక కాఫీ సంస్ధతో వ్యాపార ఒప్పందం చేసుకుంది. అదేబాటలో రజనీకాంత్‌చంద్రముఖి నిర్మాతలు టాటాఇండికాం కంపెనీతో ఒప్పందంచేసుకున్నారు. ఈ సినిమా నాలుగు దక్షిణాదిభాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాతెలుగు పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఈసినిమాలో టాటా ఇండికాం సర్వీసును చిత్రీకరిస్తారు. అంతే కాదు ఈసినిమా హోర్డింగ్‌లపై టాటా ఇండికాం కనిపిస్తుంది.చంద్రముఖిలో మలయాళ నటి నయనతార హీరోయిన్. ఈసినిమాలో రజనీకాంత్ ఎన్నారై డాక్టర్‌గా నటిస్తున్నారు. శివాజీప్రొడక్షన్స్‌బ్యానర్‌పై నిర్మితమవుతున్నచంద్రముఖికి పి.వాసు దర్శకత్వంవహిస్తున్నారు.
రజనీకాంత్ తాజా చిత్రంచంద్రముఖి తర్వాత మరే చిత్రంలోనూనటించరని వార్తలు వచ్చాయి. కానీ ఆయనతమిళ, తెలుగు భాషా చిత్రాలు మరికొన్నిటిలోనటించనున్నట్టు తెలిసింది. బాబా సినిమా హిట్‌అయితే సినిమా రంగానికి గుడ్‌బై చెబుతానని ఆయన రెండేళ్ళక్రితం ప్రకటించారు.కానీ బాబా ఫ్లాప్ కావడంతో ఆయనమరో సినిమా చేయవలసి వచ్చింది. ఈసారి ఆయనసినిమా ఫీల్డుకు గుడ్‌బై చెబుతానన్న ప్రకటనలుచేయడం లేదు. అధ్యాత్మిక చింతన ఎక్కువగలరజనీ బాబా సినిమా క్లెయిమాక్స్‌లో ఒకఅర్ధంపర్ధం లేని దైవం సీన్ పెట్టారు. ఆయనరాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న చర్చకుకూడా ఆ సినిమాలో ఉంది. దానితో అది గంద్రగోళంసినిమాగా మారింది. చంద్రముఖి హిట్‌అవుతుందనిసంపూర్ణ విశ్వాసం గల రజనీకాంత్ అభిమానులనుమరికొంతకాలం ఆనందపరచడం కూడామాధవసేవ వంటిదేఅని భావిస్తున్నట్టుంది.


Click it and Unblock the Notifications











