రామదాసు,పౌర్ణమి హక్కులు కెఎడికి

By Staff

నాగార్జునశ్రీ రామదాసు, ప్రభాస్‌ పౌర్ణమిసినిమాల విదేశీ ప్రదర్శన హక్కులనుప్రముఖ పంపిణీ సంస్ధ కెఎడిఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్ధచేజిక్కించుకుంది. మారుతీ మూవీస్‌సహకారంతో కెఎడి ఈ సినిమాలనువిదేశాల్లో విడుదల చేయనుంది.భక్తిరస, చారిత్రక చిత్రంఅన్నమయ్య సినిమా వచ్చినతొమ్మిదేళ్ళ తర్వాత నాగార్జున, కెరాఘవేంద్ర రావుల కాంబినేషన్‌లోవస్తున్న శ్రీ రామదాసు పై భారీఅంచనాలున్నాయి. ఈ సినిమాలో రాముడిగాసుమన్‌, కబీర్‌దాస్‌గా అక్కినేనినాగేశ్వరరావు నటించారు.కీరవాణి 19 పాటలను, కీర్తనలనుస్వరపరిచారు. స్నేహ, అర్చన, నాగబాబుముఖ్యమైన పాత్రలు వేశారు. ఈ సినిమాఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

కెఎడివిదేశీ హక్కులు పొందిన పౌర్ణమి కూడాభారీ చిత్రమే. సక్సెస్‌ఫుల్‌ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్‌,చార్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈసినిమా మార్చి 30న విడుదల కానుంది.

ఈసినిమాలను విదేశాల్లోని థియేటర్లలోప్రదర్శించదలచుకున్న వారు ఈనెంబరును సంప్రదించవచ్చు 9174491823.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X