ఈసంవత్సరం ప్రభాస్‌దా?
ప్రభా్‌సకెరియర్ గురించి పరిశ్రమలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.గత ఏడాది సంక్రాంతి చిత్రం వర్షంహిట్ అయిన దగ్గర నుంచి అతని గ్రాఫ్‌పెరుగుతూనే ఉంది. అతని తదుపరిచిత్రం అడవి రాముడు ఓ మోస్తరుగాఆడినా ఇప్పుడు అనేక ఆఫర్లు వస్తున్నాయి.కృష్ణవంశీ దర్శకత్వం ప్రభాస్ నటించిన చక్రం ఫిబ్రవరిలో విడుదలకానుంది. ఆ సినిమా హిట్ అయితే ఇకప్రభాస్‌ను ఎవరూ ఆపలేరన్ని సినిమాపండితుల అంచనా. ఇప్పటికే రెండు మూడు కోట్లు పారితోషికం అడుగుతున్నఅతను ఫిబ్రవరి తర్వాత ఇంకాపెంచుతాడేమోనని కొందరు నిర్మాతలు 2006 లోతీసే చిత్రాలకు కూడా అతనికి కథలు విన్పిస్తున్నారు. ఇప్పుడు కమిట్‌చేయించుకుంటే రెండు కోట్లతోసరిపోతుంది కదా అని నిర్మాతల ఉద్దేశం.ఎస్‌ఎస్ రాజమౌళిఇ దర్శకత్వంలోఛత్రపతిసినిమాలో ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్నాడు. ఆ తర్వాతప్రాజెక్టుఎంఎస్ రాజుది. ఆ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. పెదనాన్న కృష్ణంరాజుతోచిన్నికృష్ణ దర్శక త్వంలో బద్రినాథ్ సినిమాకూడా షూటింగ్‌కు సిద్ధమవుతోంది.
తెలుగుసినిమా రంగంలో నగదు రూపంలోఅత్యధిక పారితోషికం తీసుకునే హీరో జూనియర్‌ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్‌ఇంతకంటే కొంచెం మాత్రమేతక్కువ తీసుకుంటాడు. చిరంజీవి పారితోషికం విలువఅయిదు కోట్లపైనే అయినాఆయన నగదు కాకుండా ఒక పెద్దఏరియా హక్కులు తీసుకుంటారు. సినిమా ఎలాఆడినా ఆయనకు ఐదు కోట్ల పైన గిట్టు బాటు అవుతాయి.పారితోషికం విషయంలో బాలకృష్ణ లిబరల్. తనవాడుఅనుకున్న నిర్మాతకు ఆయన రెండుకోట్ల పారితోషికానికైనా నటిస్తారు. ఆయనపారితోషికం విషయంలో పట్టుదలగా ఉంటే నాలుగు కోట్లవరకు వర్కవుట్ చేసుకునే వీలుంది.నాగార్జున,వెంకటేష్‌లు స్టాండర్డ్‌గా మూడు కోట్లుపుచ్చుకుంటారు. మహేష్‌బాబు రెండు నుంచిమూడు కోట్లు, రవితేజా రెండు కోట్లు తీసుకుంటున్నారు. అందరి కంటేసరసమైన ధరకు లభించే హీరోరాజేంద్ర ప్రసాద్. అతని పారితోషికంఇరవై లక్షలే. హీరోయిన్లలో త్రిషఅత్యధిక పారితోషికం 40నుంచి 50 లక్ష లుడిమాండ్ చేస్తోంది. ఆ తర్వాత ఆర్తిఅగర్వాల్ 30నుంచి 40 లక్షలుపుచ్చుకుంటున్నది. త్రిష నెంబర్ వన్‌అయ్యాక శ్రీయ వెనుకబడిపోయింది.ఇప్పుడామె 20నుంచి 30 లక్షలకుసినిమా చేయడానికి రెడీ. భూమిక కూడా అదేరేంజిలో ఉంది. మూడు నుంచి ఐదు లక్షల లోపుతీసుకునే హీరోయిన్లు లయ,కీర్తి చావ్లా,అంకిత, సంగీత, గజాలా.


Click it and Unblock the Notifications











