సిరులు కురిపిస్తున్న లక్ష్మి
లారెన్స్ స్టైల్ కంటే వెంకటేష్ లక్ష్మి ముందు ఉందని ఇదివరకు చాలాసార్లు మా పాఠకుల దృష్టికి తెచ్చాం. సంక్రాంతి సినిమాల్లో సిరులు తెస్తున్న సినిమాగా లక్ష్మి నిలిచింది. స్టైల్ సినిమాలో సృజనాత్మకత, కొంచెం కొత్తదనం, దర్శకత్వపు మెరుపులు ఉన్నప్పటికీ రిపీట్ ఆడుయెన్స్‌ను ఆకర్షించగల స్టార్ వ్యాల్యూ లేకపోవడం వల్ల ఈ సినిమా లక్ష్మి కంటే వెనుకబడింది. ష్టైల్ లో ఉన్న మదర్ సెంటిమెంట్ కంటే, లక్ష్మి ఫ్యామిలీ సెంటిమెంట్ బి, సి సెంటర్ల ప్రేక్షకులకు బాగా పట్టింది. దేవదాసు సినిమా మూడో స్ధానంలో ఉంది. వెంకటేష్ మార్కు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు వివి వినాయక్ తర హా యాక్షన్ జోడు కావడంతో ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్లు వసూలు చేసే అవకాశముంది. సిద్ధార్ధ్ హీరోగా వచ్చిన భారీ వ్యయపు సినిమా చుక్కల్లో చంద్రుడు మేం రాసినట్టుగానే చిక్కుల్లో చంద్రుడుగానే కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











