చంద్రముఖి ఫస్ట్, అతనొక్కడే సెకండ్
నిన్న విడుదలైన భద్రకు మిశ్రమ టాక్ వచ్చింది. కొత్త దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా తీసినా ఒక్కడు వంటి పాత కథ సినిమాను కొంతవరకు దెబ్బతీసింది. టెక్నికల్‌గా ఇది మంచి ప్రమాణాలు గల సినిమా. బాక్సాఫీసు వద్ద దీని జాతకమేమిటో కొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది. దిల్ ఆర్య వంటి వినూత్న చిత్రాలు తీసి విజయవంతమైన దిల్ రాజు ఈ ఫార్ములా చిత్రం తీసి యావరేజ్ ఫలితం పొందారు. గతంలో రెండు ఫ్లాపులు ఇచ్చిన నందమూరి కళ్యాణ్‌రామ్‌కు ఊరట కలిగించే చిత్రం అతనొక్కడే. స్క్రీన్ ప్లేలో ప్రతిభ చూపిన దర్శకుడు సురేందర్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. పక్కా మాస్ మసాలా సినిమా. వసూళ్ళు క్రమంగా పుంజుకుని సినిమా హిట్ రేంజిని దాటిపోవ చ్చు. సంగీత దర్శకుడు శశిప్రీతం దర్శకుడిగా మారి తీసిన సినిమా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేక్షకుల ప్రాణాలు తీస్తోంది. సొంత సినిమాకు కూడా శశి మంచి సంగీతం సమకూర్చుకోలేకపోయారు. చంద్రముఖి ఇప్పటికీ అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో అతనొక్కడే నిలిచింది.


Click it and Unblock the Notifications











