సూపర్‌విదేశీ హక్కులు కెఎడికి
నాగార్జునసూపర్ విదేశీ ప్రదర్శనహక్కులను కెఎడి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధపొందింది. ఇప్పటికి ఎన్నో పెద్ద తెలుగు సినిమాలనువిదేశాల్లో విడుదల చేసిన కెఎడి నాగార్జునసినిమా హక్కులు పొందడం ఇదేమొదటిసారి. సూపర్ డివిడిహక్కులను కూడా ఈ సంస్ధ పొందింది. జూన్‌లోనేవిడుదల కానున్న చిరంజీవి చిత్రం అందరివాడువిదేశీ హక్కులను జెమిని ఫిల్మ్ సర్క్యూట్‌పొందిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలఆడియోలు వారం రోజుల్లోపల ఈ నెల 23నవిడుదల కానున్నాయి. సూపర్ సినిమాలోఉండే మోటార్ సైకిల్ చేజింగ్ సన్నివేశాలుతెలుగు సినిమా టెక్నికల్ విలువను పెంచగలవనిభావిస్తున్నారు. చిరంజీవి మరో సినిమా జైచిరంజీవ విదేశీ హక్కులు కూడా కెఎడికి దక్కాయి.ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











