తగ్గుతున్నభద్ర, ఎదురులేని అతనొక్కడే
రవితేజభద్ర సినిమా మొదటి వారం కలెక్షన్లుబాగున్నా రెండోవారం తగ్గేఅవకాశముంది. ఒక్కడు తొలిప్రేమసినిమాలను కలిపి తీశారన్న ప్రచారంవల్ల కలెక్షన్లు తగ్గవచ్చు. రవితేజఎనర్జిటిక్‌గా నటించినా పాత కథ సినిమాను దెబ్బతీసింది. దిల్,ఆర్యవంటి విజయవంతమైన సినిమాలు తీసినదిల్ రాజుకు భద్రతో తానుహ్యాట్రిక్ సాధించానా లేదా అన్న డైలమాపట్టుకుంది. త్వరలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌సినిమా విడుదల అవుతున్నందునభద్ర కలెక్షన్లు భద్రంగా ఉండేఅవకాశం లేదు. ఇక మహిళా చిత్రంకుంకుమ ఎలాంటి ఆర్భాటం లేకుండావిడుదలైంది. ఈ సినిమాలో స్టార్స్‌లేకపోయినా కథాంశం కారణంగామహిళా ప్రేక్షకులు ఆక ర్షితులవుతున్నారు.ఈ సినిమా ఆ నలుగురులా సైలెంట్‌గాహిట్ అయినా ఆశ్చర్యం లేదు. సురేందర్‌దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌సినిమా అతనొక్కడే నిస్సందేహంగాహిట్ అయింది. రెండో వారం కూడా 90 శాతంకలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా క్రెడిట్‌అంతా దర్శకుడు సురేందర్‌దే. ఈ సినిమా తమిళ రీమేక్‌హక్కులు 65 లక్షలకు అమ్ముడు పోవడం విశేషం. ఇకరజనీకాంత్ చంద్రముఖి ఏ రేంజ్‌లో హిట్‌అయిందో ప్రత్యేకంగాచెప్పనవసరం లేదు. ఈ సినిమా కలెక్షన్లుఆరో వారంలోనూ నిలకడగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











