చిన్నసినిమాలను జయించనున్నయువసేన
కె.విశ్వనాథ్‌స్వరాభిషేకం అన్ని వర్గాల ప్రజలనుఆకర్షించలేకపోతున్నది. ప్రజలఆలోచనాధోరణి, ఆచార వ్యవహారాలువేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో విశ్వనాథ్‌తీసుకున్న ఇతివృత్తం, పాత్రలనుమలిచిన తీరు సినిమాకు మైనస్ అయికూర్చున్నాయి. కలెక్షన్లు క్రమంగాక్షీణిస్తున్నాయి. సంగీతం, పాటలు బాగున్నాసినిమా విజయానికి అవొక్కటే చాలవని రుజువైంది.కొత్త హీరోయిన్ ఆముక్త మాల్యదపెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్‌ది ఇండ్రస్టీ అయింది. ఆఅమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది.
ఎఎం రత్నంనిర్మించిన బృందావన్ కాలనీ యావరేజ్‌టాక్‌తో నడుస్తోంది. రొటీన్‌ప్రేమకథలకు కొంచెం భిన్నంగా ఉండడంఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే యాంటీక్లెయిమాక్స్‌తెలుగు ప్రేక్షకుల వరకు మైనస్‌పాయింట్. హీరో రవికృష్ణ, దర్శకుడుసెల్వ రాఘవన్‌ల ప్రతిభకు ప్రశంసలులభిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్‌అప్పారావు డ్రైవింగ్ స్కూలు తొలివారంకలెక్షన్లు బాగున్నా వారాంతంలో క్షీణిస్తున్నాయి.దీపావళి నాడు విడుదలై యువసేనచిత్రానికి హిట్ టాక్ రావడంతోయావరేజి సినిమాల కలెక్షన్లుపడిపోయే అవకాశముంది.


Click it and Unblock the Notifications











