నీలుగుతున్ననాలుగు సినిమాలు
ఈ వారంవిడుదలైన నాలుగు చిన్న సినిమాలు నేలచూపులుచూస్తున్నాయి. ఆనంద్ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నకమలినీ ముఖర్జీ నటించిన మీనాక్షి ఒకహిందీ చిత్రానికి పూర్తి అనుసరణ. ఈ సినిమాకథ బాగున్నా ట్రీట్‌మెంట్ బాగుండకపోవడంతో ప్రేక్షకులఆదరణ పొందలేకపోతోంది. ఎప్పుడోపూర్తయి, ఏళ్ళుగా విడుదలకు నోచుకోని భరత్ అయిందాలేదా సినిమా పనివిడుదలైన రోజే అయిపోయింది. యాక్షన్,ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నహే భగవాన్ సినిమా చూసి జనం అదేటైటిల్ అనుకుని దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. ఈసినిమాలో అన్నీ ఉన్నా ఏదీసరిగ్గా లేదు. రంభ నీకు ఊర్వసి నాకుసినిమా సెన్సార్ కత్తెర పడినతర్వాత రంభ ఊర్వసిగావిడుదలైంది. యువతరాన్నిశృంగారంతో ఉర్రూత లూగిద్దామన్నలక్ష్యంతో తీసిన ఈ సినిమా ఏ తరాన్నీఆకట్టుకునేలా లేదు. బి, సి సెంటర్లలో కొన్నిరోజులు ఆడవచ్చు. రెండు డబ్బింగ్ తమిళచిత్రాలు గజిని ప్రేమిస్తే కలెక్షన్లవర్షం కొనసాగుతోంది. వాటి మధ్య నిలబడిన ఏకైన తెలుగు చిత్రంఛత్రపతి.


Click it and Unblock the Notifications











