twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ టాక్...కలెక్షన్స్ టాప్...ఇండస్ట్రీ షాక్

    By Srikanya
    |

    ముంబై: వినిపిస్తున్న టాక్ కు కలెక్షన్స్ కు సంభంధం లేకుండా భాక్సాఫీస్ వద్ద ఒక్కోసారి పెద్ద హీరోల చిత్రాలకు మ్యాజిక్ జరుగుతూంటుంది. తాజాగా అలాంటిది బాలీవుడ్ లో జరిగింది. హృతిక్, కత్రినా కైఫ్ ల కాంబినేషన్ లో రూపొందిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం కు మార్నింగ్ షో నుంచే ఫ్లాఫ్ టాక్ వచ్చింది. అయితే కలక్షన్స్ మాత్రం ఊపుతోంది. రిలీజైన ఈ నాలుగు రోజుల్లోనే 94.13 కోట్లు షేర్ (134.47 కోట్లు గ్రాస్)చేసింది. ఈ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఏడవదిగా రికార్డు క్రియేట్ చేసింది.

    Trade rejoice as business in Bollywood soar riding on 'Bang Bang'

    చిత్రం కథేమిటంటే...లండన్ లో కోహినూర్ వజ్రం ఉంటుంది. దాన్ని రాజ్ వీర్(హృతిక్ రోషన్)దొంగతనం చేస్తాడు. అయితే ఆ వజ్రాన్ని అతని నుంచి లేపేయటానికి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఓమర్ జాఫర్(డానీ), హమీద్ గుల్(జావెద్ జాఫ్రీ) గ్యాంగ్ వెంటపడుతూంటూంది. అయితే ఈ మాఫియా గ్యాంగ్ లకు దొరకకుండా ఓమర్ జాఫర్ ని ఎలగైనా కలుసుకోవాలని రాజ్ ప్రయత్నిస్తూంటారు. ఇంతకీ రాజ్...ఓమర్ జాఫర్ ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు. ఈ ఛేజింగ్ లో రాజ్ తో కలిసిన హర్లీన్(కత్రినా) ఎవరు... అసలు కోహినూర్ వజ్రం దొంగతనం వెనక ఉన్న అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే చిత్రం పూర్తిగా చూడాల్సిందే.

    హాలీవుడ్‌ సినిమా 'నైట్‌ అండ్‌ డే'కిది రీమేక్‌. 2010లో విడుదలైన ఈ చిత్రంలో టామ్‌ క్రూయిజ్‌, కెమెరన్‌ డియాజ్‌ ప్రధాన పాత్రధారులు. 'బ్యాంగ్‌ బ్యాంగ్‌'ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ చిత్రం లాంటి కథ,కథనాలు మనకు గతంలో కొన్ని చిత్రాల్లో వచ్చేసి ఉండటంతో పెద్ద గొప్పగా అనిపించదు. పూర్తి ఛేజింగ్ లతో నడుస్తూండటంతో రెగ్యులర్ సినీ గోయిర్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే హృతిక్ రోషన్ చేసిన సాహసాలు, కత్రినా అందచందాలు ఈ సినిమాకు ప్లస్. వీటిని అద్బుత రీతిలో ఆవిష్కరించారు.

    English summary
    Hrithik Roshan and Katrina Kaif's Bang Bang has been smashing box office numbers. It made 175.61 crore gross worldwide in four days. The film has made 22.41 crore nett on Sunday taking the total India tally to 94.13 crore (134.47 crore gross).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X