Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాస్కుపట్టిన ఒక్కడే
ఎఎం రత్నంముద్దులకొడుకు ప్రేక్షకుల వాత్సల్యాన్ని,ఆదరణను పొందలేకపోతున్నాడు. కథలో అందానికి సంబంధించిన ఆత్మన్యూనతకూ, హీరో చేసిన త్యాగానికిపొంతన కుదరకపోవడంతో మంచిమెసేజ్తో ముగియాల్సిన సినిమా ప్రేక్షకులకువిసుగును మిగుల్చుతోంది. ఈ సినిమా మహిళాప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న అంచనాలుకూడా తారుమారయ్యాయి. ప్రేక్షకులు థియేటర్లలోఆడుతున్న నాలుగు సినిమాలను పోల్చి చూసుకుని, ఏసినిమాకు మంచి టాక్ వస్తే దానికి వెళ్ళడం వల్లబిలో యావరేజి సినిమాలకు చావు దెబ్బ తగుల్తోంది.శ్రీహరి ఒక్కడే క్లియర్‌గా మాస్ ప్రేక్షకులనుఆకట్టుకునే విధంగా ఉంది. ఏ హీరోకు ఎటువంటిప్రేక్షకులు ఉంటారో స్పష్టంగా తెలుసుకుని తీయడం వల్ల ఈసినిమా శ్రీహరికి టైలర్‌మేడ్ అయింది. ఈ సినిమా క్లాస్కుపట్టకపోయినా మాస్‌ను అలరిస్తోంది. ఇదపెద్ద హిట్ కాకపోయినా పెట్టుబడికి ఢోకాఉండదు. గోపీచంద్ ఆంధ్రుడు ఓపెనింగ్స్బాగున్నాయి. రానున్న వారాల్లో కొన్నిపెద్ద సినిమాలు విడుదల అవుతున్ననేపధ్యంలో ఈ సినిమా ఏ రేంజి హిట్ అన్నదితెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. అ, ఆ అక్షరాలతోమొదలయ్యే చిత్రాలు హిట్ కావడమో, మినిమం గ్యారంటీగాఆడడమో జరుగుతుందన్నసెంటిమెంట్ను ఆంధ్రుడుబలపరుస్తోంది. ముచ్చటగా మూడు పాత్రలతోతీసిన ప్రయోగాత్మక చిత్రంమొగుడు పెళ్ళాం ఓ దొంగోడు భవిష్యత్తుఇంకా తేలవలసి ఉంది. ఇటీవలి కాలంలోప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులుఆదరిస్తున్నందువల్ల దీని విజయావకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేం.