twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వసూళ్ళలోనూసై

    By Staff
    |

    నితిన్‌హీరోగా రాజమౌళి దర్శకత్వంలోనిన్న విడుదలైన సై సినిమాక్లైమాక్స్‌లోని విలన్‌ తో ఆడే గేమ్‌ ప్రేక్షకులనువిశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాకలెక్షన్లు బాగున్నాయి. మరో మంచిసినిమా లేకపోవడంతో గుడుంబాశంకర్‌ రెండో వారంలో కూడా టాప్‌లో నిలిచింది.అయితే సై హిట్‌ కావడంతో ఈ వారంఇదే అగ్రస్ధానంలోకి వస్తుంది. తమిళరీమేక్‌ చెప్పవే చిరుగాలి శుక్రవారంవిడుదల అయింది. సినిమాలో తమిళవాసన ఎక్కువగా ఉండడం, హాస్యం పండకపోవడంవల్ల ఈ సినిమా ఆశాజనకంగా లేదు.కమల్‌ హసన్‌ తమిళ చిత్రానికి రీమేక్‌పోతురాజు హిట్‌ అయిందంటూ సక్సెస్‌మీట్‌ పెట్టినప్పటికీ ఈ సినిమా ఆశించినస్ధాయిలో ఓపెనింగ్‌ కలెక్షన్లురాబట్టలేకపోయింది.

    నటుడిగాదర్శకుడిగా కమల్‌ ప్రతిభబాగున్నా సినిమాలోని మితిమీరిన హింసని తెలుగుప్రేక్షకులు చూడలేకపోతున్నారు.శృంగార ప్రధాన చిత్రం సోగ్గాడిసరదాలు సి గ్రేడ్‌ సినిమా. దీనిని మెయిన్‌్రస్టీం సినిమాగా పరిగణించనవసరంలేదు. ఈ సినిమా థియేటర్ల వద్దమహిళా ప్రేక్షకులు కన్పించడంలేదు. గుడుంబా శంకర్‌ కలెక్షన్లుమొదటి వారంతో పోల్చుకుంటే బాగా తగ్గాయి.

    ఈసినిమాలోని ఫైట్స్‌, హాస్యం పవన్‌అభిమానులకు నిరుత్సాహం కలిగించాయి.ఇది ఫ్యామిలీ సినిమా కాదన్న అభిప్రాయంరావడమే ఈ చిత్ర పరాజయానికికారణమని సినిమా పండితులువిశ్లేషిస్తున్నారు. కలెక్షన్లలోఅర్జున్‌ రెండో స్ధానంనిలబెట్టుకున్నాడు. సుమంత్‌ గౌరిమూడో వారం వసూళ్ళలోనూ నిలకడగాఉంది.

    Recent Stories

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X