'బిజినెస్ మ్యాన్' సూపర్ హిట్ (ట్రేడ్ టాక్)
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఈ రోజు విడుల అయ్యింది. ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా బిజినెస్ పరంగా సేఫ్ వెంచర్ అని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల టాక్. దానికి కారణం ఈ చిత్రానికి క్రేజ్ మాత్రమే అని విశ్లేషిస్టున్నారు. చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయటం, మహేష్ దూకుడుతో ఫామ్ లో ఉండటం ప్లస్ అయ్యాయని చెప్పుతున్నారు. అలాగే మహేష్,పూరీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన దూకుడు చిత్రం హిట్ అవటం కూడా బిజినెస్ వర్గాల వారిని ఆకర్షించిందని అంటున్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ క్రేజ్ చూపించటానికి మరో కారణం ఈ చిత్రం డైలాగులతో వదిలిన టీజర్. టీజర్ ద్వారా వచ్చిన ఉచ్చపోయిస్తా డైలాగు అంతటా పాపులర్ అవ్వటంతో చిత్రంపై పూర్తి కాన్పిడెన్స్ అందరిలో పెంచి ఫ్యాన్సీ రేట్లకు చిత్రాన్ని తీసుకున్నారు. అలాగే ఇక్కడ పదహారు వందల ధియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే కమర్షియల్ హిట్ గా అభివర్ణిస్తున్నారు.
మరో ప్రక్క ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రెండువేల థియేటర్లలో విడుదల చేయడానికి సాహసిస్తున్నారు. అవకాశమున్న ఏ మార్కెట్‌నీ వదిలిపెట్టడంలేదు. జపాన్‌లోనూ కొత్తగా అడుగుపెడుతున్నారు. అమెరికాలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్‌తో విడుదల చేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ డబ్బింగ్ వెర్షన్లతో పాగా వేస్తున్నారు. 'దూకుడు' మహేష్ సక్సెస్‌నీ, 'బుడ్డా హోగా తేరా బాప్' పూరీ జగన్నాధ్ బాలీవుడ్ విజయాన్నీ సొమ్ము చేసుకోవాలన్న వ్యూహంతో కదులుతున్న ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, విజయవాడలో కొన్ని ఏరియాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మునెపెన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో 70 థియేటర్లలో 'బిజినెస్‌మేన్' ని విడుదల చేస్తోంది. నైజాంలో 110 థియేటర్లు, హైదరాబాద్‌లో 100 థియేటర్లు బుక్ చేసుకుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా మొత్తం రెండువేల థియేటర్లలో ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications











