»   » ట్రైడ్ టాక్ : 'బాహుబలి' తొలి రోజు ఎంత కలెక్టు చేస్తుంది

ట్రైడ్ టాక్ : 'బాహుబలి' తొలి రోజు ఎంత కలెక్టు చేస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ క్రేజీ చిత్రం తెలుగు వెర్షన్ ఎంత కలెక్టు చేయవచ్చు అనే విషయమై ట్రేడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ విషయమై కొన్ని అంచనాలుకు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ బాహుబలి తొలి రోజు... 15 కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంటున్నారు. బెనిఫిట్ షో నుంచి వచ్చే మొత్తం కూడా రికార్డు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. 15 కోట్లు వరకూ కలెక్టు చేస్తే..మిగతా అన్ని చోట్లా కలిపి మరో ఐదు కోట్లు వసూలు చేసి మొత్తం 20 కోట్లు మార్కుని చేరుతుంది అంటున్నారు. కేవలం యుఎస్ లోనే ...$800K నుంచి $1M కు చేరే అవకాసం ఉంది.

ఇక మొదటి వారం బాహుబలి కలెక్షన్స్ అరవై కోట్లు వరకూ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే షేర్ కూడా భారీగా ఉంటుందని ఎక్సపెక్టు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిటర్లు ఈ చిత్రం ప్రదర్శించే ధియోటర్లలో టిక్కెట్ రేటు ని రెట్టింపు చేయనున్నారు.
'బాహుబలి' చిత్రం విశేషాలకు వస్తే....

Trade talk: Rajamouli's Baahubali Day 1 Estimate

కేవలం భారతదేశంలోని సినీ ప్రియులే కాదు...ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారతీయ పరిశ్రమ నుంచి రాబోతున్న ఓ అద్భుత చిత్రంగా ఈ సినిమాను కొనియాడుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రతిష్ఠాత్మక బీబీసీతో రాజమౌళి మాట్లాడారు. ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం బీబీసీ ఆసియా విభాగంలో ప్రసారం చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
Rajamouli's visual extravaganza Baahubali is likely to collect around fifteen crores share from Telugu states on its first day.
Please Wait while comments are loading...