నరసింహనాయుడు అప్ డేట్
గతవారంనాలుగు, ఈ వారం ఐదు సినిమాలు విడుదలకాగా నేడు విడుదలైన సంక్రాంతిమినహా ఏ సినిమా కూడా నిర్మాతలకు, బయ్యర్లకు ఆనందంమిగల్చలేదు. విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభమయ్యేమార్చిలో సినిమాలు విడుదల చేయడానికినిర్మాతలు సాహసించరు. అందువల్లఫిబ్రవరి నెలలో ఎక్కువ సినిమాలువిడుదలవుతుంటాయి. ప్రేక్షకుల్లో ఆశలురేపిన తేజ ధైర్యం, విఎన్ ఆదిత్యమనసు మాట వినదు సినిమాలునిరాశపరిచాయి. పాత చింతకాయ పచ్చడి లాంటికథలు ఈ రెండు సినిమాలను బలితీసుకున్నాయి.ధైర్యం సినిమాలో పాసివ్‌క్యారెక్టర్లు సినిమానుపండించలేకపోయాయి. ఈ సినిమా చూడడానికిచాలా ధైర్యం కావాలనిప్రేక్షకులు జోకులేసుకుంటున్నారు.నవదీప్, అంకిత నటించినమనసు మాట వినదులో పాటలుబాగున్నా కథ పలుచనై పోయింది.దాదాపు నాలుగు కోట్లు ఖర్చయిన ఈ సినిమా బయ్యర్లకు పెద్దనష్టం మిగిల్చేఅవకాశముంది. వార్త యజమాని గిరీష్‌సంఘీ ఒరేయ్ పండు కు ప్రేక్షకులు దూరంగా ఉంటున్నారు.సినిమా టాక్‌నుమొదటి రోజే అర్ధం చేసుకున్న ఎస్వీకృష్ణారెడ్డి తీవ్ర డిప్రెషన్‌నుగురైనట్టు తెలిసింది. ఇక కృష్ణ సినిమాఎవరు నేను పేరుకు తగ్గట్టేఅడ్రస్ లేకుండా పోయింది. వచ్చే వారంరాధాగోపాళం శ్రావణమాసం సినిమాలు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











