Home
రాజేంద్రప్రసాద్ ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఈ సినిమా పెద్ద పబ్లిసిటీ లేకుండా విడుదల అయింది. ఈ సినిమా టేకింగ్ టీవీ సీరియల్‌లా ఉండడంతో ప్రేక్షకులు భరించలేకపోతున్నారు. హనుమంతు సినిమాలో శ్రీహరి బాగా నటించినా అతని కృషి ఫలించే అవకాశం లేదు. ఈ సినిమా బి,సి సెంటర్లలో ఓ మోస్తరుగా ఆడుతున్నా, కలెక్షన్లు నిలకడగా లేవు. శేఖర్ కమ్ముల గోదావరికి హిట్ టాక్ వచ్చినప్పటికీ బయ్యర్లకు పెద్ద లాభాలు వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఈ సినిమాకు ఆరుకోట్లకు పైగా ఖర్చవ్వడం దీనికి ఒక కారణం. అయితే మరో మంచి క్లాస్ చిత్రాన్ని అందించినందుకు శేఖర్ కమ్ములను అభినందించాలి. 75 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేయగదనిపిస్తున్న పోకిరి ఆ దిశగా వేగంగా సాగిపోతోంది.


Click it and Unblock the Notifications











