Home

By Staff

టాలీవుడ్‌లో గత వారం విడుదలై ప్రేక్షకుల తీర్పు కోరిన చిత్రాలలో ముఖ్యమైనవి విశాల్‌, రీమాసేన్‌, శ్రియారెడ్డి నటించిన పొగరు డబ్బింగ్‌ చిత్రం కాగా మరో స్ట్రయిట్‌ తెలుగు చిత్ర ం టాటా బిర్లా.. మధ్యలో లైలా. శివాజీ, లయ, కృష్ణభగవాన్‌, అలీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం కామెడీ బాగానే పండించినా టెక్నికల్‌గా సినిమాలో నాణ్యత లోపించడంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేదని ట్రేడ్‌ వర్గాల విశ్లేషణ.

విశాల్‌ తొలి చిత్రం ప్రేమచదరంగం తెలుగులో మంచి టాక్‌ సంపాదించగా, రెండో చిత్రం పందెం కోడి.. అనూహ్యంగా అనేక కేంద్రాలలో 100 రోజులు దాటి ప్రదర్శితమై విశాల్‌ రేంజ్‌ని పెంచింది. ఆ నేపథ్యంలో పొగరు విడుదల చేయగా అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్స్‌ రాబట్టిందీ చిత్రం. అయితే, టైటిల్‌కి తగ్గట్టే ఇది పూర్తి మాస్‌ చిత్రం కావడం, యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువైపోవడం, మూసపోసిన పాత కథ ఈ చిత్రానికి డ్రాబ్యాక్‌ అయ్యాయి. ఫలితంగా పొగరు చిత్రం తొలి వారం ఉన్న కలెక్షన్లు క్రమంగా డీలాపడుతున్నాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

ఇవిలా ఉండగా, పోకిరి చిత్రం ఈ గురువారం (అక్టోబర్‌ 19)కి 63 కేంద్రాలలో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై టాలీవుడ్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ నెలకొల్పింది. పోకిరి చిత్రం ఇప్పటికి 66 కోట్ల రూపాయల పైగా గ్రాస్‌ వసూలు చేసినట్టు ట్రేడ్‌ సమాచారం. ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న చిత్రాలలో పెద్ద హీరోలు నటించిన స్టాలిన్‌, బాస్‌ ఒక మోస్తరుగా నడుస్తుండగా, బొమ్మరిల్లు చిత్రం 70 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ చాలా ఏరియాలలో స్ట్రాంగ్‌గా ఉందని, ఇప్పటికీ 60 నుంచి 70 శాతం కలెక్షన్లు సాధిస్తోందని తెలుస్తోంది.

అక్టోబర్‌ 19న జగపతిబాబు జర్నలిస్టుగా నటించిన సామాన్యుడు, 20న గోపిచంద్‌ నటించిన రారాజు చిత్రాలు విడుదలయ్యాయి. వాటి ఫలితాలు వచ్చే వారం కల్లా తెలుస్తాయి.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X