Home
గురువారం విడుదలైన స్టైల్‌కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. నృత్యాలు, సెంటిమెంట్ బాగున్నా కథను నడపడంలో లోపాల కారణంగా ఈ సినిమా బి,సి సెంటర్లలో మాత్రమే నడిచే అవకాశముంది. బుధవారం విడుదలైన దేవదాసుకు కూడా సినీ విమర్శకులు ఫర్వాలేదనే మినీ కితాబు ఇచ్చారు. నిజానికి ఈ రెండు సినిమాలు ఎంతో శ్రమించి చేసినవి. సంక్రాంతి నాడు విడుదల కానున్న లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు సినిమాల ఫలితాన్ని బట్టి ఈ సినిమాల భవిష్యత్తు కొంత వరకు ఆధారపడి ఉంటుంది. సంక్రాంతి సినిమాలకు భయపడి ఏమో రాజేంద్ర ప్రసాద్ సరదా సరదాగా సినిమా ఈ నెలాఖరుకు వాయిదా పడింది. నవదీప్ నాలుగో సినిమా గౌతం ఎస్‌ఎస్‌సికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు తగ్గిపోతున్నట్టు ట్రేడ్ టాక్. సంక్రాంతి సినిమాల తర్వాత ఈ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్ధకమే.


Click it and Unblock the Notifications











