బాక్సాఫీస్ రిపోర్ట్
శంకర్‌దాదా,ఎంబిబిఎస్ కలెక్షన్లు బాగానే ఉన్నా లాభాలువస్తాయో రావోనన్న భయం బయ్యర్లలో ఉన్నాయి. ఈసినిమా ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేస్తే తప్పబయ్యర్లకు లాభాలు రావు. హిందీలో సూపర్‌డూపర్ హిట్ అయిన ఈ సినిమాతెలుగులో ఆ రేంజికి చేరే అవకాశంలేదు. గట్టి విలన్‌తో చిరంజీవి సినిమా అంతాఫైట్లు చేయాలని ఆశించే అభిమానులకు ఈ సినిమాసంతృప్తి కలిగించదు. కానీ కథా బలంకారణంగా ఆబాలగోపాలాన్ని అలరించగలగడంఈ సినిమా ప్లస్ పాయింట్. అయితే తీవ్రమైనభావోద్వేగాలు రేకెత్తించేచిత్రం కాకపోవడంతో రిపీట్‌ఆడియెన్సు తక్కువగా ఉండడం ఈ భారీచిత్రానికి పెద్ద లోటు. ఇటువంటి సినిమానుఇంకా తక్కువ వ్యయంతో నిర్మించితక్కువకు అమ్మి ఉంటే బయ్యర్లకుకాస్తయినా లాభాలు కళ్ళ చూసేవారు.
జాతీయఅవార్డు గ్రహీత శే ఖర్ కమ్ముల దర్శకత్వంలో లోప్రొఫైల్‌లోవిడుదలైన ఆనంద్ సినిమానిర్మాతలకు లాభాల పంట పండించనుంది.ఒకటిన్నర కోట్లు మాత్రమే ఖర్చయిన ఈసినిమా మొదట మూడు నగరాల్లోనేవిడుదలయింది. మంచి టాక్ రావడంతో సినిమాను రాష్ట్రమంతటా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బైండ్‌చేసిన స్క్రిప్టుతో రూపొందిన ఈచిత్రం ఒకనాటి తెలుగు సినిమాస్వర్ణయుగాన్ని గుర్తు చేస్తుంది. ఇది దర్శకుడి చిత్రం.కథనంలోవైవిధ్యం ప్లస్ పాయింట్.


Click it and Unblock the Notifications











