Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం 14న విడుదల కానుంది. నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవడం, ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా విజయం ఖాయమని భావిస్తున్నారు.
టాలీవుడ్లో గత వారం విడుదలై ప్రేక్షకుల తీర్పు కోరిన చిత్రాలలో ముఖ్యమైనవి విశాల్, రీమాసేన్, శ్రియారెడ్డి నటించిన పొగరు డబ్బింగ్ చిత్రం కాగా మరో స్ట్రయిట్ తెలుగు చిత్ర ం టాటా బిర్లా.. మధ్యలో లైలా. శివాజీ, లయ, కృష్ణభగవాన్, అలీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం కామెడీ బాగానే పండించినా టెక్నికల్‌గా సినిమాలో నాణ్యత లోపించడంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేదని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
విశాల్ తొలి చిత్రం ప్రేమచదరంగం తెలుగులో మంచి టాక్ సంపాదించగా, రెండో చిత్రం పందెం కోడి.. అనూహ్యంగా అనేక కేంద్రాలలో 100 రోజులు దాటి ప్రదర్శితమై విశాల్ రేంజ్‌ని పెంచింది. ఆ నేపథ్యంలో పొగరు విడుదల చేయగా అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టిందీ చిత్రం. అయితే, టైటిల్‌కి తగ్గట్టే ఇది పూర్తి మాస్ చిత్రం కావడం, యాక్షన్ సన్నివేశాలు ఎక్కువైపోవడం, మూసపోసిన పాత కథ ఈ చిత్రానికి డ్రాబ్యాక్ అయ్యాయి. ఫలితంగా పొగరు చిత్రం తొలి వారం ఉన్న కలెక్షన్లు క్రమంగా డీలాపడుతున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇవిలా ఉండగా, పోకిరి చిత్రం ఈ గురువారం (అక్టోబర్ 19)కి 63 కేంద్రాలలో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై టాలీవుడ్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డ్ నెలకొల్పింది. పోకిరి చిత్రం ఇప్పటికి 66 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ సమాచారం. ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న చిత్రాలలో పెద్ద హీరోలు నటించిన స్టాలిన్, బాస్ ఒక మోస్తరుగా నడుస్తుండగా, బొమ్మరిల్లు చిత్రం 70 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ చాలా ఏరియాలలో స్ట్రాంగ్‌గా ఉందని, ఇప్పటికీ 60 నుంచి 70 శాతం కలెక్షన్లు సాధిస్తోందని తెలుస్తోంది.
అక్టోబర్ 19న జగపతిబాబు జర్నలిస్టుగా నటించిన సామాన్యుడు, 20న గోపిచంద్ నటించిన రారాజు చిత్రాలు విడుదలయ్యాయి. వాటి ఫలితాలు వచ్చే వారం కల్లా తెలుస్తాయి.