అభిమానులకుథ్యాంక్స్!
ఈ సంవత్సరం నవంబర్ 1న వచ్చే దీపావళి సీజన్‌లో ప్రేక్షకులను అలరించడానికి ప్రధానంగా నాలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే, వాటిలో పెద్ద హీరో చిత్రం ఒక్కటి కూడా లేదు. సాధారణంగా దీపావళిని తమిళనాడులోనే సినిమాల సీజన్‌గా అభివర్ణిస్తారు. కానీ.. ఇప్పుడు తెలుగులో కూడా దీపావళికి సినిమాల సందడి ఊపందుకుంటోంది. ఈ సారి పండుగకు వారం అటు, ఇటుగా నాలుగు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు, మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఆదిలక్ష్మి
శ్రీకాంత్, నవీన్, శ్రీదేవి ప్రధాన తారాగణంగా ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఆదిలక్ష్మి. ఇందులో శ్రీకాంత్ ఒక రౌడీ షీటర్‌గా, నవీన్ లాయర్‌గా నటిస్తున్నారు. సురేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్నారు. ఆదిలక్ష్మి పాటలు ప్రస్తుతం దుబాయ్‌లో షూట్ చేస్తున్నారు. మూడు పాత్రల మధ్య ప్రేమ, సంఘర్షణలు ఇతివృత్తంగా అన్ని కమర్షియల్ హంగులతో ఆదిలక్ష్మి రూపొందుతోంది. ఆదిలక్ష్మి చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు.
ప్రేమలేఖ రాశా..
గీతరచయిత కులశేఖర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రేమలేఖ రాశా.. నూతన నటీనటులు వెంకట్ మల్లాది, అంజలి హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీరామ్ కౌశిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అచ్చతెలుగు ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.
రారాజు
గోపిచంద్, మీరాజాస్మిన్, అంకిత ప్రధాన తారాగణంగా రూపొందుతున్న రారాజు చిత్రం ఆడియో అక్టోబర్ 6న హైదరాబాద్‌లో విడుదలవుతుంది. తొలిప్రేమ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన జి వి జి రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలిసుందాం.. రా.. వంటి సూపర్‌హిట్ చిత్రం అందించిన దర్శకుడు ఉదయ్‌శంకర్ చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. మణిశర్మ సంగీతం అందించారు.
మాయాబజార్
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కమర్షియల్ చిత్రం - మాయాబజార్. రాజా, భూమిక చావ్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా సాగనుంది. ఒక చిన్నారి చుట్టూ జరిగే సంఘటనలు ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చక్కని కుటుంబ కథా చిత్రంగా అందరినీ అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఆనంద్, గోదావరి చిత్రాలకు చక్కని సంగీతం అందించిన కె.ఎమ్. రాధాకృష్ణన్ మాయాబజార్‌కు అంతటి మంచి సంగీతాన్ని మళ్లీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు.
చిన్నోడు
సుమంత్, ఛార్మి జంటగా కణ్మణి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం - చిన్నోడు. గతంలో నా ఊపిరి.. అనే చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న కణ్మణి ఈసారి పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం యూనిట్ యూరప్ దేశాలకు వెళ్లి వచ్చింది. కాట్రగట్ట లోకేశ్ ఈ చిత్రానికి నిర్మాత. గతంలో సుమంత్, ఛార్మి జంటగా వచ్చిన గౌరి చిత్రం హిట్‌గా నమోదు కావడంతో ఈ కాంబినేషన్ మరోసారి విజయం సాధిస్తుందని నిర్మాత ఆశిస్తున్నారు.
ఇవి కాకుండా - సూర్య, జ్యోతిక, భూమిక నటించిన నువ్వు.. నేను.. ప్రేమ.., సురేశ్ గోపి హీరోగా రామానాయుడు నిర్మించిన మళయాల చిత్రం తెలుగులో మోసగాళ్లకు మోసగాడుగా విడుదలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











