చాలా కాలం తర్వాత వైజయంతి మూవీస్‌ నాగార్జునతో నిర్మించిన చిత్రం ఇది. నువ్వు వస్తావని తర్వాత నాగార్జున ఫుల్‌ లెంగ్త్‌ హీరో రోల్‌ చేసిన చిత్రమిది. గతంలో ఎన్నో హిట్‌ చిత్రాలను అందించిన అశ్వనీ దత్‌ చిత్రం కావడంతో ఆజాద్‌ పై భారీగానే అంచనాలున్నాయి. గణేష్‌ చిత్ర దర్శకుడు తిరుపతి స్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. శిల్పాశెట్టి, సౌందర్యలు హీరోయిన్‌ లుగా నటించిన ఈ చిత్రంలో మ్యూజిక్‌ ప్రధానంగా లోపం

By Staff

దసరా ఇంకా పదిహేను రోజులు ఉందనగా.. దానికి ముందే చిన్న, డబ్బింగ్‌ చిత్రాలు తామరతంపరగా విడుదలైపోతున్నాయి. దీనికో కారణం ఉంది. సెప్టెంబర్‌ 20 మెగాస్టార్‌ చిరంజీవి స్టాలిన్‌, దానికి మరో వారం వ్యవధిలో నాగార్జున రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ బాస్‌ భారీ రిలీజ్‌లు ఉండటంతో వాటికి ముందే తమ సత్తా నిరూపించుకుని అంతో ఇంతో వసూళ్లు దక్కించుకోవాలని చిన్న నిర్మాతలు ఆశపడుతున్నారు.

గత రెండు వారాల్లో విడుదలైన చిత్రాలు జాబితా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సెప్టెంబర్‌ 1 నుంచి 15వ తేదీ లోగా సగటున రోజుకో చిత్రం చొప్పున విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 1న లోకల్‌ టాలెంట్‌ నిర్మించిన హైదరాబాద్‌ నవాబ్స్‌, శివనాగేశ్వరరావు ఫోటో, కె. రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాశ్‌, షబానా ఆజ్మి తదితరులు నటించిన రాగం చిత్రాలు విడుదలయ్యాయి. 2వ తేదీన హీరో శివాజీ, అంకిత జంటగా నటించిన యాక్షన్‌ చిత్రం సీతారాముడు విడుదలైంది.

సెప్టెంబర్‌ 8వ తేదీన అత్యధికంగా ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ సంతోష్‌ శివన్‌ రూపొందించిన మళయాల డబ్బింగ్‌ చిత్రం శివపురం, శింబు నటించిన రుద్రుడు, టెన్త్‌ క్లాస్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారి మా యిద్దరి మధ్య.., నయనతార, ఎస్‌.జె. సూర్య జంటగా రూపొందిన చిలిపి, ఆర్‌. నారాయణమూర్తి నిర్మించి, నటించిన అడవి బిడ్డలు, ఇంకా సంతోష్‌ పవన్‌, జ్యోతి జంటగా రూపొందిన కొంటె కుర్రాళ్లు.

వీటిలో ఫోటో, కొంటె కుర్రాళ్లు అట్టర్‌ ఫ్లాపులుగా ఇప్పటికే ఖరారయ్యాయి. అడవి బిడ్డలు చిత్రం సందేశాత్మకంగా ఉన్నా కలెక్షన్లు ఇంకా పెరగలేదు. బి, సి సెంటర్లలో ఈ చిత్రం కలెక్షన్లే చిత్రాన్ని నిలబెట్టాలి. ఇంక డబ్బింగ్‌ చిత్రాలైన చిలిపి, శివపురం, రుద్రుడు చిత్రాలకు పెద్దగా ఆదరణ లేదు. కొత్త నటీనట వర్గంతో నిర్మించిన మా యిద్దరి మధ్య.. పెద్దగా ఏమీ లేదనే విషయాన్ని తేల్చింది. కొద్దోగొప్పో పబ్లిసిటీ స్టంట్‌ కారణంగా శివాజీ నటించిన సీతారాముడు కలెక్షన్లు రాబట్టుకుంటోంది. అయితే, ఈ చిత్రానికి టాక్‌ పెద్దగా సహకరించడం లేదు.

ఇప్పటికీ బొమ్మరిల్లు అగ్రస్థానంలో ఉండగా, అందాల రాముడు చిత్రం ఫర్లేదనిపిస్తోంది. ఈ వారం రామ్‌గోపాల్‌ వర్మ శివ 2006, రామానాయుడు, కల్యాణి ప్రధాన పాత్రలలో నటించిన హోప్‌ చిత్రాలు విడుదలయ్యాయి. వాటి భవిష్యత్తు వచ్చే వారానికి తేలుతుంది.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X