Home
చిరంజీవి-మురుగదాస్‌ల స్టాలిన్ చిత్రం విదేశీ ప్రదర్శన, డివిడి హక్కులను కెఎడి ఎంటర్టైన్మెంట్ సంస్ధ పొందింది. విదేశాల్లోనే దాదాపు పాతిక ప్రింట్లను విడుదల చేసి, పాత రికార్డులను బద్దలు కొట్టనున్నారని తెలిసింది. స్టాలిన్‌ను చిరంజీవి జన్మదినమైన అగస్టు 22న విడుదల చేయాలని నిర్మాత నాగబాబు ఆలోచిస్తున్నారు. సామాజికస్పృహ, సృజనాత్మకత అధికంగా ఉన్న ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నందు వల్ల ఈ పై చిరు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చివరి షెడ్యూలు మే 27న ప్రారంభమైంది. దాదాపు నెలరోజుల పాటు హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి, త్రిషలపై ఈనెల 10 నుంచి 19 వరకు యూరప్‌లో రెండు పాటలను రాజు సుందరం నృత్యదర్శకత్వంలో చిత్రీకరించారు.
More from Filmibeat
varsham picks up collections and is directly competing with laxminarasinha sankranthi films anji chiranjeevi balakrishnas laxminarasinha varsham boxoffice report telugu top films telugu cinema telugu films


Click it and Unblock the Notifications











