Transfer Trimurthulu Closing Collections: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు క్లోజింగ్ కలెక్షన్లు.. లాభమా? నష్టమా?
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ చిత్రంలో రాశీ సింగ్, శిల్ప తులస్కార్, వివేక్ రఘువంశీ, రఘు బాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, గాయత్రి తదతరులు నటించారు. ఈ సినిమాకు కమల్ తేజ నార్ల రచనా సహకారంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు హీరో వడ్డే నవీన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు వడ్డే జిష్ణు సమర్పకుడిగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: కల్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫి: కార్తీక్ సుజాత సాయికుమార్, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, లిరిక్స్: భాస్కరభట్ల రవికుమార్, ఫైట్స్: రాబిన్ బాబు, రామ్ సుంకర, ఆర్ట్: భిక్షపతి కందకట్ల, కొరియోగ్రఫి: విజయ్ పోలంకి, దినేష్, కాస్టూమ్ డిజైనర్: శ్రావ్య రెడ్డి తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. వడ్డె క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా వారం రోజులుగా వసూలు చేసిందెంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

హీరో వడ్డే నవీన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. నిజాయితీపరుడైన కానిస్టేబుల్ లైఫ్ జర్నీ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 7 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కమీషన్ బేస్ మీద సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ ద్వారా 30 శాతం రికవరీని సాధించింది. ఇక థియేట్రికల్ వాల్యూను 3 కోట్లకు అటు ఇటుగా వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఈ సినిమా 3 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఈ సినిమా రిలీజ్ ముందు మంచి అటెన్షన్ కూడగట్టుకొన్నది. అయితే రిలీజ్ తర్వాత కంటెంట్ డిఫరెంట్‌గా లేకపోవడం, అలాగే కథ, కథనాలు పాతతరం వాసనలు ఉండటం వల్ల ఈ మూవీ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడంలో సఫలం కాలేదు. ఈ చిత్రం తొలి రోజు 15 లక్షల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు 10 లక్షల గ్రాస్, మూడో రోజు 10 లక్షలు, నాలుగో రోజు 8 లక్షల గ్రాస్, ఐదో రోజు 8 లక్షలు, ఆరో రోజు 7 లక్షలు, ఏడో రోజు 6 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ తగ్గిపోవడంతో చాలా తక్కువగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సుమారుగా 70 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రం థియేట్రికల్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకు భారీగానే నష్టాలు వాటిల్లాయి. ఈ సినిమాకు సుమారుగా 2.3 కోట్ల రూపాయలు ఇంకా వసూలు చేయాల్సి ఉంది. దాంతో ఆ మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఈ సినిమాకు ఇటీవల రిలీజైన మా ఇంటి బంగారం, దీవానా సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ఈ సినిమా కమర్షియల్ వాల్యూస్ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
వడ్డే నవీన్ దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి.. నటనతోను, గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. కానీ కంటెంట్ బెటర్‌గా డిజైన్ చేసి ఉంటే ఆయన రీ ఎంట్రీకి మంచి ఫలితం దక్కేది. ఆయన వయసుకు తగిన పాత్రే చేసినప్పటికీ.. సోలోగా ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గానీ, మల్టీ స్టారర్ సినిమాతో వస్తే ఆయనకు ప్రేక్షకుల ఆదరణ ఉండే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications