Transfer Trimurthulu Day 1 Collections: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కలెక్షన్స్.. వడ్డే నవీన్ మూవీకి ఫస్ట్ డే ఎంత

1990, 2000 దశకాలలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. లవ్, రొమాంటిక్, కుటుంబ కథా చిత్రాలతో ఆయన అలరించారు. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, చాలా బాగుంది, మనసిచ్చి చూడు, స్నేహితులు తదితర సినిమాలతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నవీన్. అయితే అనూహ్యంగా ఆయన వెండితెరకు దూరమయ్యారు. 2016లో చివరిసారిగా అటాక్ అనే సినిమాలో నవీన్ నటించారు. అప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక దశాబ్ధం తర్వాత నవీన్ తిరిగి రీ ఇంట్రీ ఇచ్చారు. అదే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు తారాగణం
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ స్వయంగా ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ తేజ్ నార్ల దర్శకత్వం వహిస్తుండగా.. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, శ్రీనివాస్ వడ్లమాని, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 19న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు బడ్జెట్ ఎంత? ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు వడ్డే నవీన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Transfer Trimurthulu Day 1 Expected Box Office Collections Worldwide Vadde Naveen s film Opening day Report

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుపై హైప్
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా బడ్జెట్ ఎంత అనే వివరాలు తెలియరాలేదు. టీజర్, ట్రైలర్లు, నవీన్ ఇతర యూనిట్ సభ్యులు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు, వడ్డే నవీన్ రీ ఎంట్రీ కారణంగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రైట్స్‌ ఆ కంపెనీ చేతికి
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను జీ గ్రూప్ మంచి ధరకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ డీల్ నిమిత్తం ప్రదర్శించిన స్పెషల్ స్క్రీనింగ్‌ను చూసిన వెంటనే జీ ప్రతినిధులు .. ఈ డీల్ క్లోజ్ చేసినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డీల్ వాల్యూ ఎంత అనేది తెలియరానప్పటికీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు తొలిరోజు కలెక్షన్స్ అంచనా
ఈ సినిమాపై ఓ మాదిరి బజ్ ఉన్నప్పటికీ బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్, రూరల్ ఏరియాలలో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీకి ఓ మోస్తరు బుకింగ్ జరుగుతుండగా.. మల్టీప్లెక్స్‌లో మాత్రం పరిస్ధితి దారుణంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో పెద్ది, నూరు సామి, కాక్‌టెయిల్ 2 సహా పలు చిత్రాలు ఉండటంతో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు బుకింగ్‌పై ప్రభావం చూపిస్తోంది.

శుక్రవారం, వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ ముగిస్తే కానీ వడ్డే నవీన్ మూవీ రిజల్ట్ ఏంటన్నది తెలిసే అవకాశం లేదు. మరి రీ ఎంట్రీలో ఈ ఫ్యామిలీ హీరో ఎంత వరకు సత్తా చాటుతాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X