Transfer Trimurthulu Box Office: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు బాక్సాఫీస్ పరిస్థితేంటి? వడ్డె నవీన్ మూవీపై ఆ దెబ్బ
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ చిత్రంలో రాశీ సింగ్, శిల్ప తులస్కార్, వివేక్ రఘువంశీ, రఘు బాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, గాయత్రి తదతరులు నటించారు. ఈ సినిమాకు కమల్ తేజ నార్ల రచనా సహకారంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు హీరో వడ్డే నవీన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు వడ్డే జిష్ణు సమర్పకుడిగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: కల్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫి: కార్తీక్ సుజాత సాయికుమార్, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, లిరిక్స్: భాస్కరభట్ల రవికుమార్, ఫైట్స్: రాబిన్ బాబు, రామ్ సుంకర, ఆర్ట్: భిక్షపతి కందకట్ల, కొరియోగ్రఫి: విజయ్ పోలంకి, దినేష్, కాస్టూమ్ డిజైనర్: శ్రావ్య రెడ్డి తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. వడ్డె క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

హీరో వడ్డే నవీన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. నిజాయితీపరుడైన కానిస్టేబుల్ లైఫ్ జర్నీ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 7 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కమీషన్ బేస్ మీద సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ ద్వారా 30 శాతం రికవరీని సాధించింది. ఇక థియేట్రికల్ వాల్యూను 3 కోట్లకు అటు ఇటుగా వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఈ సినిమా 3 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ రెస్సాన్స్ కూడగట్టుకోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజ 25 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు 15 లక్షల గ్రాస్, మూడో రోజు 15 లక్షల గ్రాస్, నాలుగో రోజు 10 లక్షల గ్రాస్, ఐదో రోజు 10 లక్షల గ్రాస్, ఆరో రోజు 5 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 80 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమాకు రిలీజ్ ముందు ఉన్న క్రేజ్ విడుదల తర్వాత కనిపించలేదు. అందుకు కారణం ఈ సినిమాకు ఇతర చిత్రాల నుంచి భారీగా పోటీ ఉండటం ప్రధాన కారణంగా చెప్పుకొంటున్నారు. మా ఇంటి బంగారం, దీవానా సినిమాల నుంచి బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదుర్కొన్నది. దాంతో ఈ సినిమా ఎక్కువగా ప్రేక్షకులను రీచ్ కాలేకపోయింది. ఈ సినిమాల ప్రభావం వడ్డ నవీన్ మూవీపై దెబ్బ కొట్టింది. వేరే రిలీజ్ డేట్‌లో వచ్చి ఉంటే ఈ సినిమా ఫలితం ఇంకా బెటర్‌గా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది


Click it and Unblock the Notifications