Transformers One Collections: 630 కోట్ల బడ్జెట్.. ట్రాన్స్‌ఫార్మర్ వన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ టాయ్ కంపెనీ హాస్‌బ్రో గురించిన వివరాల ఆధారంగా రూపొందిన ట్రాన్స్‌ఫార్మర్స్ టాయ్ లైన్ అనే చిత్రం ఆధారంగా రూపొందిన అమెరికన్ యానిమేటేడ్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ చిత్రం ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (Transformers One). జోష్ కూలీ దర్శకత్వంలో డాన్ మర్ఫీ, టామ్ డీ సాంటో, మైఖేల్ బే నిర్మించారు. ఈ చిత్రంలో క్రిస్ హమ్స్ వర్త్, బ్రియా టైరీ హెన్నీ, స్కార్లెట్ జాన్సన్, కీగన్ మైఖేల్, జాన్ హమ్మ తదితరులు పాత్రలకు వాయిస్ అందించారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థలు పారామౌంట్ యానిమేషన, హాస్‌బ్రో ఎంటర్‌టైన్‌మెంట్, న్యూ రిపబ్లిక్ పిక్చర్స్ తదితరులు బ్యానర్లపై ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాను 75 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 630 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారీ అంచనాలతో ఈ సినిమా సెప్టెంబర్ 20 తేదీన రిలీజైంది.

ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (Transformers One) చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను సుమారుగా 4 వేల స్క్రీన్లలో ప్రదర్వించారు. ఈ సినిమా సుమారుగా 26 మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 217 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.
అయితే ఈ చిత్రం అంచనాలకు దిగువగానే వసూళ్లను సాధించింది. కానీ తొలి రోజు, ప్రీమియర్ల కలెక్షన్లు స్ట్రాంగ్‌గానే కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం 3.5 మిలియన్లు రాబడితే.. తొలి రోజు 6.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 9.7 మిలియన్ డాలర్లు 83 కోట్ల వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇండియాలో ఈ సినిమాకు అంతంత మాత్రమే స్పందన కనిపించింద. ఈ చిత్రం ఇండియాలో 1 కోటి రూపాయలు నికరంగా 2 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అతి తక్కువగా కలెక్షన్లు రాబట్టడానికి కారణం ఈ సినిమా రిలీజ్ అవుతున్నదనే వార్త, ప్రమోషన్స్ లేకపోవడమే.. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా మౌత్ టాక్‌తో పుంచుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశాభావంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











