Transformers Closing collections:వరల్డ్ వైడ్ 1600 కోట్లు..ట్రాన్స్‌ఫార్మర్స్‌కు ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్ల
ట్రాన్స్‌ఫార్మర్స్ లైవ్ యాక్షన్ సిరీస్‌లో ఏడో చిత్రంగా రూపొందిద్దుకొన్న చిత్రం ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్. హాస్ప్‌బ్రో రూపొందించిన ట్రాన్స్‌ఫార్మర్స్, బీస్ట్ వార్స్ స్టోరీలైన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. న్యూ రిపబ్లిక్ పిక్చర్స్, స్కైడాన్స్ మీడియా, పారామౌంట్ పిక్చర్స్ నిర్మించింది. పీటర్ కల్లెన్, మిచెల్ీ యో, పీటర్ డింక్లేజ్, రాన్ పెర్ల్‌మ్యాన్, ఆంథోని రామోస్, జాన్ డిమాగియో, పీట్ డేవిడ్సన్, లునా లారేజ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందే ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఇండియాలో తొలి వారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
స్టీవెన్ కెపుల్ జూనియర్ దర్శకత్వంలో రూపొందిన ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ సినిమాను 200 మిలియన్ డాలర్ల వ్యయం అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 1650 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాను సుమారుగా ఇండియాలో 1800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రం తొలి రోజు ఇండియాలో 4.2 కోట్లు, రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 5.6 కోట్లు, నాలుగో రోజు 5.75 కోట్లు, ఐదో రోజు 2.15 కోట్లు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఏడో రోజు 2 కోట్లు, ఎనిమిదో రోజు 1.5 రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలివారం సుమారు 28 కోట్లు వసూలు చేసింది.
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రం ప్రాంతాల వారీగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 15 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 10 కోట్లు, తెలుగు వెర్షన్ 1.5 కోట్లు, తమిళంలో 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మలయాళంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లను సాధించింది.
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రం అమెరికా, కెనడా మినహాయించి భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం బ్రిటన్, ఆస్ట్రేలియాతోపాటు ఇతర దేశాల్లో 985 కోట్లు వసూలు చేసింది. అమెరికా, కెనడా దేశాలతో కలిపి సుమారు 1650 కోట్లు రాబట్టింది. బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టు కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











