Transformers: Rise Of The Beasts collections ట్రాన్స్‌ఫార్మర్స్ కలెక్షన్ల రచ్చ..రికార్డులతో వసూళ్ల వర్షం
ప్రపంచ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న ట్రాన్స్‌ఫార్మర్స్ లైవ్ యాక్షన్ సిరీస్‌లో ఏడో చిత్రంగా రూపొందిద్దుకొన్న చిత్రం ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్. హాస్ప్‌బ్రో రూపొందించిన ట్రాన్స్‌ఫార్మర్స్, బీస్ట్ వార్స్ స్టోరీలైన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియాలో ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందే ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఇండియాలో ఎంత తొలి రోజు వసూళ్ల అంచనా ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ సినిమాకు స్టీవెన్ కెపుల్ జూనియర్ దర్శకత్వం వహించగా..న్యూ రిపబ్లిక్ పిక్చర్స్, స్కైడాన్స్ మీడియా, పారామౌంట్ పిక్చర్స్ నిర్మించింది. పీటర్ కల్లెన్, మిచెల్ీ యో, పీటర్ డింక్లేజ్, రాన్ పెర్ల్‌మ్యాన్, ఆంథోని రామోస్, జాన్ డిమాగియో, పీట్ డేవిడ్సన్, లునా లారేజ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రం బడ్జెట్, స్క్రీన్ కౌంట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను 200 మిలియన్ డాలర్ల వ్యయం అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 1650 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాను సుమారుగా ఇండియాలో 1800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ సినిమాకు ఉన్న క్రేజ్‌తో భారీగానే ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు తొలి రోజున దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమాకు తొలి రోజు 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో రిలీజైన హాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోల్చితే ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ చిత్రం ఆరో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది. ఫాస్ట్ ఎక్స్, యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ క్వాంటమానియా, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ, జాన్ విక్ 4 చిత్రాల తర్వాత ఈ చిత్రం అతి పెద్ద వసూళ్లను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి వారాంతానికి ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. అమెరికాలో తొలి మూడు రోజుల్లో 55 మిలియన్ డాలర్లను, చైనాలో 40 మిలియన్ డాలర్లతో కలిపి 100 మిలియన్లు ఓవర్సీస్‌లో వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











