'1 నేనొక్కడినే' లో ట్రిమ్ చేసిన సీన్స్
హైదరాబాద్ : సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన '1 నేనొక్కడినే' చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవటంతో ట్రిమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రిమ్ చేసిన వెర్షన్ అందరి మన్ననలూ పొందుతోందని చెప్తున్నారు. ఇంతకూ సినిమాలో ఏయే సీన్స్ ట్రిమ్ చేసారు...ఏవి తొలిగించారు అన్న విషయాలు...ట్రేడ్ లో చెప్పబడుతున్నవి.
ఫస్ట్ హాఫ్ లో...ట్రిమ్ చేసినవి.. :
1) ఆవ్ తుఝో అనే పాటకు ముందు ఎపిసోడ్ లో...హీరోయిన్ పై మర్డర్ ఎటెమ్ట్ జరగటం..మహేష్ బాబు ఆమెను సేవ్ చేయటం మొత్తం ట్రిమ్ చేసారు. అదే పేస్ మెయింటైన్ చేయటానికి దాదాపు 7 నుంచి ఎనిమిది నిముషాలు వరకూ ట్రిమ్ చేసారు.
2) అనేక చోట్ల 15-20 సెకండ్లు ట్రిమ్ చేసారు. విలన్స్ ని మహేష్ సెర్చ్ చేయటం వంటివి తొలిగించారు.

సెకండాఫ్ లో ట్రిమ్ చేసినవి :
1) బ్యాక్ లాకర్ ఓపినింగ్ సీన్ లో బ్యాంక్ మేనేజర్..లాక్ గురించి, బ్యాంక్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వటం.
2) ప్రీ క్లైమాక్స్ లో... రైస్ ప్లాంట్ గురించి నాజర్ సెమినార్,అలాగే నాజర్-మహేష్ మీటింగ్ సీన్స్ ను 7-8 నిముషాల వరకూ ట్రిమ్ చేసారు
ఓవర్ రాల్ గా:
క్రితి-మహేష్ ఎపిసోడ్ దాదాపు ఎనిమిది నిముషాలు
నాజర్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ లో ఏడు నిముషాలు
దాదాపు ఎనిమిది నుంచి పది సీన్స్ వరకూ 10-20 సెకండ్లు వరకూ ట్రిమ్ చేసారు.
మొత్తం మీద 19 నిముషాల వరకూ ట్రిమ్ చేసి రన్ టైమ్ ని 150 నిముషాలకు కుదించారు.
'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల అయ్యింది. ఈ చిత్రం మన దేశంతో పాటు జపాన్, రష్యా, అమెరికా, కొరియాల్లో ఆయా ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది.
ఇక '1' సినిమా చూసిన ప్రతి ఒక్కరు మహేష్ నటన గురించి, సుకుమార్ దర్శకత్వం గురించే మాట్లాడుకుంటారు. టాలీవుడ్‌లో చిత్రీకరించిన హాలీవుడ్ స్థాయి సినిమాగా '1' నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర. వీరు నిర్మాతలుగా తెరకెక్కించిన చిత్రం '1'. మహేష్‌బాబు, కృతిసనన్ జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications











