Bad Newz Collections: ఓవర్సీస్‌లో బ్యాడ్ న్యూస్ రికార్డు కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద త్రిప్తి డిమ్రి సంచలనం
యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ నటించిన బ్యాడ్ న్యూస్ (Bad Newz) చిత్రం వరల్డ్ వైడ్‌గా కలెక్షన్లు సాధిస్తున్నది. వికీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మించారు. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బ్యాడ్ న్యూస్ సినిమా సోమవారం బాక్సాఫీస్ లిట్మస్ టెస్ట్‌ను పాస్ అయింది. ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ సినిమా ఈ సినిమా 1వ రోజు 8.5 కోట్లు, 2వ రోజు 10.5 కోట్లు, 3వ రోజు 11.5 కోట్లు వసూలు చేసింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా 34 కోట్లు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో బ్యాడ్ న్యూస్ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. కల్కి, హాలీవుడ్, ఇతర సినిమాల పోటీని పోటీని తట్టుకొని ఈ చిత్రం రికార్డు వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో అతి వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మీడియా బడ్జెట్ చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.
అమెరికా, కెనడాలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం యూఎస్‌లో 650K, కెనడాలో 550K కలెక్షన్లను సాధించింది. తొలి రోజు 350K, రెండో రోజు 400K, మూడో రోజు 275K వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లో మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా ఇక నాలుగో రోజు 200K డాలర్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 1.2 మిలియన్ డాలర్లను అంటే భారతీయ కరెన్సీలో 10 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

నార్త్ అమెరికానే కాకుండా ఇతర దేశాల్లోను బ్యాడ్ న్యూస్ భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో మెరుగైన వసూళ్లను నమోదు చేస్తున్నది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 300K ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది.
ఇక బ్యాడ్ న్యూస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 34 కోట్ల రూపాయలు నికరంగా, 36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 4 రోజుల్లో 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











